Gold Price Today : శ్రావణంలో మహిళలకు గుడ్ న్యూస్.. బంగారం ధరలు దిగివస్తున్నాయ్

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి

Update: 2024-08-06 03:22 GMT

బంగారం ధరలు శ్రావణమాసంలో కొంత దిగి వస్తున్నాయి. ఇది పసిడి ప్రియులకు ఊరటకల్గించే విషయం. నిన్నటి వరకూ ధరలు పెరిగి ఆందోళన కలిగించిన బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో ముఖ్యంగా మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శ్రావణమాసం నిన్న ప్రారంభమయింది. ఇక మంచి ముహూర్తాలు ఉండటంతో శుభకార్యాలతో పాటు పెళ్లిళ్లు కూడా జరుగుతాయి. బంగారం, వెండి వంటి వస్తువుల కొనుగోళ్లు కూడా పెరుగుతాయి. ఈ సమయంలో బంగారం ధరలు తగ్గుతుండటం కొంత గుడ్ న్యూస్ అని చెప్పాలి. బంగారం అనేది ఇప్పుడు అవసరమైన వస్తువుగా మారింది.

శుభకార్యాలకు...
శుభకార్యాలకు బంగారం, వెండి లేనిదే ముందుకు నడవవు. దక్షిణ భారత దేశంలో పెళ్లిళ్లు, శుభకార్యాలకు ఖచ్చితంగా బంగారం, వెండి కొనుగోలు చేయడం సంప్రదాయంగా వస్తుంది. ఈ ప్రాంతంలోనే ఎక్కువగా ఆభరణాల కొనుగోళ్లు ఎక్కువగా ఉంటుంది. ప్రపంచంలో గోల్డ్ బాండ్స్ ను ఎక్కువ కొనుగోలు చేస్తుంటే.. దక్షిణ భారత దేశంలో మాత్రం బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడానికే ఎక్కువ మొగ్గు చూపుతారు. ఇష్టపడతారు. దీంతో పాటు బంగారాన్ని పెట్టుబడిగా చూసే వారు కూడా ఇటీవల కాలంలో అధికమయ్యారు. గోల్డ్ బిస్కెట్లను కొనుగోలు చేసి అవసరం కోసం తమ వద్ద దాచి ఉంచుకోవడం అలవాటుగా మార్చుకున్నారు.
స్వల్పంగా తగ్గి...
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 64,690 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 70,570 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది. కిలో వెండి ధర 91,000 రూపాయలకు చేరుకుంది. ఈ ధరలు ఉదయం ఆరు గంటల వరకే. మధ్యాహ్నానికి ధరలు పెరగడానికి, తగ్గడానికి అవకాశముంటుంది.


Tags:    

Similar News