Gold Price Today : కార్తీక మాసంలో మహిళలకు గుడ్ న్యూస్.. బంగారంధరలు తగ్గాయ్

ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొద్దిగా తగ్గుదల కనిపించింది.;

Update: 2024-11-04 03:03 GMT
gold prices today in hyderabad market, silver rates in hyderabad today, gold rates in india, gold prices today news telugu

 gold rates in india

  • whatsapp icon

బంగారం ధరలు కొంచెం పరుగును ఆపాయి. ధరలు పెరగడంతో కొనుగోళ్లు తగ్గడంతో పసిడికి డిమాండ్ కూడా అంతే స్థాయిలో తగ్గింది. ఎవరూ కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోవడంతో జ్యుయలరీ దుకాణాల వారు కూడా ఈగలు తోలుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత సీజన్ కు నేటి సీజన్ తో పోల్చుకుంటే కొనుగోళ్లు దాదాపు ముప్ఫయి శాతం పడిపోయాయి. దీనికి ప్రధాన కారణం ధరలు విపరీతంగా పెరగడమే కారణం. అంత ధనం వెచ్చించి బంగారాన్ని కొనుగోలు చేయడం అవసరమా? అన్న భావన కొనుగోలుదారుల్లో ఏర్పడటంతో షాపుల్లోకి అడుగు పెట్టేందుకు కూడా వెనకాడుతున్నారు.

కొనుగోళ్లు పడిపోవడంతో...
అందుకే బంగారం, వెండి కొనుగోళ్లు దారుణంగా పడిపోయాయి. ధన్ తెరాస్ నుంచి దీపావళి, చివరకు పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమయినప్పటికీ అనుకున్న స్థాయిలో బంగారం, వెండి కొనుగోళ్లు జరగడం లేదు. దీంతో పాటు బంగారం ధరలపై అంతర్జాతీయ మార్కెట్‌ల ధరల ప్రభావం కూడా పడింది. ద్రవ్యోల్బణం కూడా తోడయింది. విదేశాల్లో నెలకొన్న మాంద్యం, యుద్ధాలు వంటివి కూడా కారణాలుగా మారాయి. డాలర్ తో రూపాయి విలువ తగ్గడం వల్ల కూడా మార్పులు జరిగాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇన్ని కారణాలు మార్కెట్ నిపుణులు చెబుతున్నప్పటికీ అసలు బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణం కొనుగోళ్లు తగ్గడమేనని అంటున్నారు.
అందుబాటులోకి వస్తుందా?
పసిడిని కొనుగోలు చేయడానికి పెద్దగా ఎవరూ ఇష్టపడని రోజులు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే పసిడి అంటే అందరూ ప్రాణమిచ్చేవారే. కానీ ధరలు విపరీతంగా పెట్టి కొనుగోలు చేయడం వేస్ట్ అన్న అభిప్రాయం కొనుగోలుదారుల్లో బలంగా నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొద్దిగా తగ్గుదల కనిపించింది. గడిచిన నాలుగు రోజుల్లో బంగారం దాదాపు 900 రూపాయలు తగ్గింది. వెండి మూడు వేల రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 73,690 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 80,390 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 1,05,900 రూపాయల వద్ద ట్రెండ్ అవుతుంది.


Tags:    

Similar News