Gold Price Today : వావ్.. బంగారం ధరలు తగ్గాయగా.. పండగ రోజు గుడ్ న్యూస్

నేడు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి

Update: 2024-08-26 04:31 GMT

దేశంలో బంగారం అంటే ఇష్టపడని వారుండరు. ఎందుకంటే.. పసిడి అంటే అది సమాజంలో గౌరవంతో పాటు తమ జీవితానికి సెక్యూరిటీగా ఉంటుంది. తమ వద్ద ఎంత బంగారం ఉంటే అంత మేలని భావిస్తుంటారు. ధరలు పెరగడమే తప్ప తెలయని వస్తువు ఏదైనా ఉందంటే అది బంగారం, వెండి మాత్రమే. అందుకే పుత్తడికి అంతంటి గిరాకీ. దీనికి ఒక సీజన్ లేదు. సందర్భం లేదు. సందర్భాన్ని కల్పించుకుని మరీ కొందరు పుత్తడిని కొనుగోలు చేస్తుంటారు. వెండి కూడా అంతే. బంగారం ఎంత ప్రియమైన వస్తువో.. వెండి కూడా అంత ఇష్టంగా కొనుగోలు చేయడం అలవాటుగా మారింది. దీంతో ఈ రెండెంటి ధరలు అదుపు చేయడం కష్టం.

అంతర్జాతీయంగా...
కేవలం మన దేశంలోనే కాదు. అంతర్జాతీయంగా కూడా బంగారానికి ప్రతి రోజూ డిమాండ్ పెరుగుతుండటంతో ధరలు పెరగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్న మాట. ఇక బంగారంపై పెట్టుబడి పెడితే చాలు నష్టం అనేది ఉండదు. ఫ్యూచర్ లో అది తమను ఆదుకుంటుందన్న భావనతో కొందరు, బంగారం ధరలు మరింత పెరిగితే మార్పిడి చేసుకుని అవసరమైన ఆభరణాలను కొనుగోలు చేసుకోవచ్చని మరికొందరు ఇలా బంగారాన్ని ఎగబడి కొంటుంటారు. ఇక అంతర్జాతీయంగా ధరల్లో ఒడిదుడకులు, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, యుద్ధం వంటి కారణాలు బంగారం, వెండి ధరల్లో మార్పులకు కారణం.
ధరలు తగ్గి...
అయితే నేడు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. పది గ్రాముల బంగారం ధరపై వంద రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. అయితే ఈ ధరలు ఉదయం ఆరు గంటల వరకూ నమోదయినవే. మధ్యాహ్నానికి ధరలు పెరగొచ్చు. మరింత తగ్గొచ్చని వ్యాపారులు చెబుతున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,940 రూాపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 73,300 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 92,900 రూపాయలుగా నమోదయింది.



Tags:    

Similar News