Gold Price Today : వామ్మో ఏందియ్యా ఇది.. బంగారం ధర ఇలా పెరుగుతుంది?
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి.వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.;

బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయన్న మార్కెట్ నిపుణుల అంచనాలు నిజమయ్యేటట్లే కనిపిస్తున్నాయి. ధరల పరుగు ఆగడం లేదు. ధరలు ఇప్పటికే అందనంత చేరువకు చేరుకోవడంతో సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు బంగారానికి దూరంగా జరిగిపోయినట్లే కనిపిస్తుంది. కేవలం కొద్ది మంది మాత్రమే బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. అవసరం ఉన్న వారు సయితం బంగారం, వెండి వస్తువుల కొనుగోలను వాయిదా వేసుకుంటున్నారు. ఇందుకు ప్రధాన కారణం బంగారం ధరలు మరింత పెరగడమే కారణమని చెబుతున్నారు. కేంద్ర బడ్జెట్ ప్రభావం కూడా బంగారం ధరల పెరుగుదలపై పడిందని బిజెనెస్ నిపుణులు చెబుతున్నారు.
పెళ్లిళ్ల సీజన్ లో...
పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో బంగారం, వెండి వస్తువులకు గిరాకీ బాగా పెరిగింది. శుభకార్యాలకు ఎక్కువగా బంగారం, వెండి వస్తువులను వినియోగిస్తారు. పెళ్లి కుమార్తెకు బంగారాన్ని కానుకగా సమర్పించడం సంప్రదాయంగా వస్తుంది. అందుకే ఇక ఈ సీజన్ లో ధరలు తగ్గే అవకాశం లేదని వ్యాపారులు కూడా చెబుతున్నారు. ఇప్పటికే పది గ్రాముల బంగారం ధర ఎనభై ఐదు వేల రూపాయలుకు చేరుకుంది. అంత డబ్బు పోసి పెట్టుబడి పెట్టడం అంటే సామాన్యులకు సాధ్యమయ్యే పనికాదు. అయినా సరే కొందరు అప్పులు చేసి కొనుగోలు చేయాల్సి వస్తుంది. అది విధిలేని పరిస్థితుల్లోనే కొనుగోలు చేస్తున్నారు. కానీ ధరల పెరుగుదలతో కొనుగోళ్లు కొంత మేరకు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు.
భారీగా ధరలు పెరిగి...
బంగారం, వెండి వస్తువులు అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. కానీ పెరిగే బంగారం ధరలకు బ్రేకులు పడకపోవడంతో లక్ష రూపాయలు చేరుకోవడం ఎంతో దూరం లేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరపై రెండు వందల రూపాయలు పెరిగింది. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 77,450 రూపాయలుకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 84,490 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 96,000 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.