Gold Prices Today : శ్రావణం మాసం.. బంగారం మీ చెంత ఉండాలంటే?

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా నిలకడగా కొనసాగుతున్నాయి

Update: 2024-08-09 03:47 GMT

పసిడి ధరలు ఇటీవల కాలంలో తగ్గుతున్నాయి. శ్రావణమాసంలో ధరలు పెరుగుతాయని అంచనాలు తప్పు చేస్తూ తగ్గుతుండటం సంతోషకరమైన విషయమే. శ్రావణమాసంలో ఎక్కువ బంగారం కొనుగోళ్లు జరుగుతాయి. శుభకార్యాలు, పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతుండటంతో పాటు మహిళలు పూజించే లక్ష్మీదేవి అమ్మవారికి బంగారు నగలతో అలంకరించుకోవడం సంప్రదాయంగా వస్తుంది. అందుకే ధరలు పెరుగుతాయని మార్కెట్ నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు. ధరలు తగ్డినప్పుడే కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు. అయితే ధరలు ఇంకా తగ్గుతాయేమోనని వెయిట్ చేయడం మానవ బలహీనత కావడంతో అనేక మంది కొనుగోళ్లకు వెయిట్ చేస్తున్నారు.

వరసగా తగ్గుతూ...
గత మూడు రోజులుగా 22 క్యారెట్ల పది గ్రాముల బంగరాం ధర 1,200 రూపాయలు తగ్గింది. నాలుగు రోజుల్లో కిలో వెండి 4,300 రూపాయలు తగ్గింది. ఈ స్థాయిలో బంగారం, వెండి ధరలు తగ్గడం అనేది చాలా అరుదైన విషయమని వ్యాపారులు కూడా చెబుతున్నారు. డిమాండ్ ఉన్నప్పటికీ ధరలు తగ్గడానికి కారణం అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి విలువ తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం వంటి కారణాలతో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులుంటాయి. అయితే గత కొద్ది రోజులుగా భారీ స్థాయిలో ధరలు తగ్గుతుండటంతో పసిడి ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నేడు స్థిరంగా....
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా నిలకడగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 63,490 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 69,260 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 86,400 రూపాయలుగా ఉంది. అయితే ఈరోజు ఆరు గంటల వరకే ఈ ధరలు మధ్యాహ్నానికి ధరలు పెరగడమో, తగ్గడమో జరుగుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బంగారం ధరలు దిగి రావడంతో జ్యుయలరీ దుకాణాలన్నీ కిటకిటలాడుతున్నాయి.


Tags:    

Similar News