Gold Price Today : ఇంతగా షాకిస్తాయని తెలియదు సామీ.. లేకుంటే ముందుగానే
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి;

బంగారం ధరలు పెరగడం అంటే ఆశ్చర్యపోవాల్సిన విషయమేమీ కాదు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. బంగారం, వెండి వస్తువులను కేవలం స్టేటస్ సింబల్ గా మాత్రమే కాకుండా సంపదగా కూడా భావిస్తారు. భవిష్యత్ లో ఉపయోగపడే అపురూపమైన వస్తువుగా పరిగణించి దానిని సొంతం చేసుకుంటున్నారు. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా బంగారాన్ని కొనుగోలు చేయడం అలవాటుగా మారిపోయింది. చివరకు పుట్టిన రోజనాడు, పిల్లలకు పేరు పెట్టే రోజు కూడా బంగారం తప్పనిసరిగా కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తుండటంతో దాని డిమాండ్ ఎన్నటికీ తగ్గదు. అందుకే బంగారం, వెండి వస్తువుల ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
పెళ్లిళ్ల సీజన్...
నేటి నుంచి మాఘమాసం ప్రారంభమయింది. మాఘమాసం ప్రారంభమయిందంటే ఇక పెళ్లిళ్లతో సందడిగా ఉంటాయి. ఇప్పటికే మాఘమాసంలో పెళ్లిళ్ల ముహూర్తాలు ఖరారయ్యాయి. దీంతో బంగారం, వెండి కొనుగోళ్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ ఏడాది ఆరంభం నుంచే బంగారం, వెండి దరలు పెరుగుతూ వినియోగదారులను రోజూ షాక్ కు గురి చేస్తున్నాయి. ఎంత పెరిగినా బంగారం కొనుగోలు చేయడం మాత్రం శుభకార్యాల విషయాల్లో వెనక్కు తగ్గకపోవడంతో ధరలకు అదుపు లేకుండా పోతుంది. ఇలాగే పెరుగుతూ పోతే వచ్చే ఏడాదికి పది గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలకు చేరినా ఆశ్చర్యం పోవాల్సిన పనిలేదంటున్నారు మార్కెట్ నిపుణులు.
ధరలు ఇలా...
బంగారం, వెండి అంటేనే మక్కువ చూపించేది ఎక్కువగా మహిళలు. ఏ శుభకార్యానికి వెళ్లినా బంగారు నగలతో అలంకరించుకుని వెళ్లడం తమకు గౌరవం లభిస్తుందని భావిస్తారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. పది గ్రాముల బంగారం ధరపై 860 రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. ఉదయం ఆరు గంటలకు నమోదయిన ధరలు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 75,960 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 82,860 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 1,04,000 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.