ఇక మాటల ద్వారానే చెల్లింపులు.. యూపీఐలో సరికొత్త అప్‌డేట్‌

దేశంలో టెక్నాలజీ పెరిగిపోతోంది. రోజురోజుకు సాంకేతిక మరింత చేరువైపోతుంది. ఒకప్పుడు డబ్బులు విత్‌డ్రా చేయాలంటే బ్యాంకులకు.

Update: 2023-09-09 01:39 GMT

దేశంలో టెక్నాలజీ పెరిగిపోతోంది. రోజురోజుకు సాంకేతిక మరింత చేరువైపోతుంది. ఒకప్పుడు డబ్బులు విత్‌డ్రా చేయాలంటే బ్యాంకులకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా మారిపోయింది. బ్యాంకింగ్‌కు సంబంధించిన చాలా పనులు ఇంట్లోనే ఉండి మన స్మార్ట్‌ఫోన్‌లలోనే చేసుకునే వెసులుబాటు వచ్చింది. 2016లో నోట్ల రద్దు తర్వాత భారతదేశంలో డిజిటల్‌ పేమెంట్స్‌ బాగా పెరిగాయి. ముఖ్యంగా ఇందులో 50 శాతానికి పైగా చెల్లింపులు ఎన్‌పీసీఐ ప్రవేశపెట్టిన యూపీఐ పేమెంట్స్‌ ద్వారానే జరగుతున్నాయి. ఈ నేపథ్యంలో పెరిగిన ప్రజాదరణకు అనుగుణంగా ఎన్‌పీసీఐ కూడా యూపీఐ చెల్లింపుల్లో కొత్తకొత్త అప్‌డేట్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తుంది. తాజాగా ఎన్‌పీపీసీఐ వాయిస్‌ కమాండ్‌, క్రెడిట్‌ లైన్‌ వంటి ఎన్నో అప్‌డేట్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ముఖ్యంగా యూపీఐపై క్రెడిట్ లైన్, యూపీఐ లైట్ ఎక్స్‌, ట్యాప్ అండ్‌ పే, హలో యూపీఐ ద్వారా సంభాషణ చెల్లింపులు, బిల్‌పే కనెక్ట్ అంటే సంభాషణ బిల్లు చెల్లింపులు వంటి చెల్లింపులను ప్రోత్సహిస్తున్నట్లు ఇటీవల రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శక్తకాంతాదాస్‌ వెల్లడించారు. యూపీఐ ఆఫ్‌లైన్ చెల్లింపులను ప్రారంభించడానికి ఎన్‌పీసీఐ గత సంవత్సరం యూపీఐ లైట్‌ను ప్రారంభించింది. ఇప్పుడు మరికొన్ని మార్పులు చేస్తూ ప్రజలకు సులభతరమైన చెల్లింపుల వ్యవస్థను తీసుకువస్తోంది.

హలో యూపీఐ

హలో యూపీఐ ప్రస్తుతానికి హిందీతో పాటు ఇంగ్లీషులో భాషల్లో అందుబాటులో ఉంది. యాప్‌లు, టెలికాం కాల్‌లు, ఐఓటీ పరికరాల ద్వారా వాయిస్ ప్రారంభించి యూపీఐ చెల్లింపులు చేయడానికి వినియోగదారులను అనుమతఘ్తుంది. ఇది త్వరలో ఇతర అన్ని భాషల్లో అందుబాటులోకి రానుంది. అంటే మాటల ద్వారానే చెల్లింపులు చేయవచ్చు అన్నట్లు.‘హలో యూపీఐ’ వినియోగదారులు వారి స్మార్ట్‌ఫోన్‌లతో మాట్లాడటం ద్వార ఏవైనా చెల్లింపులు సులభంగా చేయవచ్చు.

యూపీఐ లైట్‌ ఎక్స్‌, ట్యాప్‌ అండ్‌ పే

యూపీఐ లైట్‌ ఫీచర్ విజయవంతమైన నేపథ్యంలో ఆఫ్‌లైన్ చెల్లింపుల కోసం యూపీఐ లైట్‌ ఎక్స్‌ను ప్రారంభించారు. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు ఇప్పుడు పూర్తిగా ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పుడు డబ్బును పంపే వెసులుబాటు ఉంది.


Tags:    

Similar News