మీకు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు అకౌంట్లు ఉన్నాయా? జాగ్రత్త

ప్రస్తుతం చాలా మంది బ్యాంకు లావాదేవీలు జరుపుతుంటారు. ఒకప్పుడు బ్యాంకు అకౌంట్లు తీసుకునే వారి సంఖ్య పెరిగిపోయింది..

Update: 2023-08-13 13:32 GMT

ప్రస్తుతం చాలా మంది బ్యాంకు లావాదేవీలు జరుపుతుంటారు. ఒకప్పుడు బ్యాంకు అకౌంట్లు తీసుకునే వారి సంఖ్య పెరిగిపోయింది. అయితే ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతా ఉండేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన ఖాతాలు కూడా భారీగానే నమోదు అవుతున్నాయి. దీంతో జీరో బ్యాలెన్స్ ఖాతాలు పెరిగిపోతున్నాయి. అకౌంట్లు పెరగడంతో బ్యాంకుల పనితీరుల్లో కూడా మార్పులు వచ్చాయి. పెరుగుతున్న డిజిటలైజేషన్ యుగంలో నెట్ బ్యాంకింగ్, ఏటీఎం కార్డు మొదలై వాటి కారణంగా బ్యాంకు ఖాతాను నిర్వహించడం సులభతరమైంది. టెక్నాలజీ మార్పుల కారణంగా ఇంట్లోనే ఉండి బ్యాంకు సర్వీసులు పొందే వెసులుబాటు వచ్చేసింది. బ్యాంకు అకౌంట్ ఖాతా కావాలంటే బ్యాంకుబ్రాంచ్ సంప్రదించాల్సి ఉండేది. కానీ ప్రస్తుత డిజిటల్ యుగంలో ఇంట్లోనే ఉండి ఆన్ లైన్ ద్వారా బ్యాంకు ఖాతా తీసుకుంటున్నాము. అయితే ఒకటి కంటే ఎక్కువ బ్యాంకులున్నవారు పలు విషయాలను గుర్తించుకోవాలి. లేకపోతే ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది.

మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్:

ప్రతి బ్యాంకు ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయాలనే నిబంధన ఉంది. ఖాతాలో కనీస బ్యాలెన్స్ లేకుంటే పెనాల్టీ ఛార్జీలు విధిస్తాయి బ్యాంకులు. ప్రతి బ్యాంకు కనీస నిల్వను నిర్వహించనందుకు జరిమానాలు వేర్వేరుగా ఉంటాయి. దీనితో పాటు బ్యాంక్ ఖాతాను యాక్టివ్‌గా ఉంచుకోవాలంటే రెగ్యులర్‌గా నిర్వహించుకోవడం చాలా ముఖ్యం . మీరు దీన్ని చేయకపోతే మీ ఖాతా నిష్క్రియం అవుతుంది. దీని తర్వాత మీరు ఖాతాను మళ్లీ యాక్టివేట్ చేసుకోవాలి. దీనితో పాటు, ఎక్కువ ఖాతాలు ఉన్నప్పుడు సైబర్ మోసం ప్రమాదం కూడా పెరుగుతుంది. నకిలీ కాల్‌లు, ఇమెయిల్‌లు లేదా సందేశాల పట్ల కస్టమర్‌లు అప్రమత్తంగా ఉండాల్సి పరిస్థితి ఉంది.

ఒక్కో బ్యాంకుకు ఒక్కో విధంగా ఛార్జీలు:

మీకు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉన్నట్లయితే బ్యాంకులను బట్టి ఒక్కో విధంగా ఛార్జీలు ఉంటాయని గుర్తించుకోండి ఖాతా నిర్వహణ కోసం ప్రతి బ్యాంకు కస్టమర్ల నుండి వివిధ వార్షిక సేవా ఛార్జీలను వసూలు చేస్తుంది. చాలా సార్లు కస్టమర్లకు ఈ ఛార్జీల గురించి తెలియదు. ఈ సందర్భంలో మీకు ఎక్కువ ఖాతాలు ఉంటే మీరు ఎక్కువ సేవా ఛార్జీని చెల్లించవలసి ఉంటుంది.

సిబిల్‌ స్కోర్ ఎఫెక్ట్:

చాలా సార్లు ఖాతాదారులు ఒకటి కంటే ఎక్కువ అకౌంట్లను తీసుకుంటారు. తర్వాత వాటిలో కనీస నిల్వ ఉంచడం మర్చిపతుంటారు. అలాంటి సమయంలో మీరు పెనాల్టీ ఛార్జీలతో నష్టపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ మినిమమ్ బ్యాలెన్స్ ఉంచుకోకుంటే మీ సిబిల్ స్కోర్ పై ఎఫెక్ట్ పడే ప్రమాదం ఉంది. ఎక్కువ ఖాతాలు ఉండి వాడుకలో లేకుంటే వెంటనే మూసివేయడం ఉత్తమం అంటున్నారు నిపుణులు. సిబిల్ స్కోర్ పడిపోవడంతో మీరు బ్యాంకు రుణం తీసుకునే సమయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. బ్యాంకులు మీకు లోన్ దరఖాస్తును తిరస్కరించే అవకాశం ఉంది.

Tags:    

Similar News