కేవైసీ అప్‌డేట్‌ చేయకుంటే బ్యాంకు అకౌంట్ నిలిచిపోతుందా?

కేవైసీ ఇటీవల కాలం నుంచి ఈ పేరును చాలా సార్లు వినే ఉంటారు. ప్రస్తుతం కొత్త కొత్త నిబంధనలు మారిపోతున్నాయి. మోసాలు..

Update: 2023-10-11 05:03 GMT

ఖాతాలు, ఇతర పథకాలకు కేవైసీని అప్‌డేట్‌ చేయడం తప్పనిసరి అయ్యింది. అంటే మీ ఆధార్‌, పాన్‌ వివరాలను మీ అకౌంట్‌, పథకాలు, తదితరాలకు అప్‌డేట్‌ చేసుకోవడం తప్పనిసరి. ముఖ్యంగా బ్యాంకు లావాదేవీలప్పుడు తప్పనిసరిగా అసరమవుతుంది. ప్రతి ఖాతాదారుడు తమ ఈ-కేవైసీని పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనిపై నిర్లక్ష్యం చేసినట్లయితే మీ బ్యాంకు అకౌంట్‌ ఖాతా తాత్కాలికంగా నిలిచిపోతుంది. దేశ వ్యాప్తంగా బ్యాంకింగ్‌ రంగం స్థిరత్వంతో పాటు ఆర్థిక వ్యవస్థ సురక్షితంగా ఉండటానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ‌(ఆర్‌బీఐ) ఈ కేవైసీ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ కేవైసీ విధానాన్ని మీరు బ్యాంకులకు వెళ్లకుండానే ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్‌లో చేసుకునే వెసులుబాటు కల్పించింది ఆర్బీఐ. కేవైసీ అంటే.. నో యువర్‌ కస్టమర్‌ (కేవైసీ). దీనిలో వినియోగదారుల సమాచారం ఉంటుంది. కేవైసీ అప్‌డేట్‌లో భాగంగా మీ ఆధార్‌, పాన్‌ వివరాలు తప్పనిసరి అందించడమే. ఈ పాన్‌, ఆధార్‌ నంబర్‌తో సెర్చ్‌ చేస్తే మీ పూర్తి వివరాలు తెలిసిపోతాయి. బ్యాంకులో ఖాతా ప్రారంభించే సమయంలో లేదా, ఇతర బ్యాంకు ఉత్పత్తుల్లో పెట్టుబడి పెట్టే సమయంలో వినియోగదారులు తప్పనిసరిగా కేవైసీ చేయించుకోవాలి.

మీరు గడువులోగా కేవైసీ వివరాలు నమోదు చేయకుంటే మీ ఖాతా స్థంభించిపోతుంది. అలాంటి సమయంలో మీరు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంటుంది. మీరు ఎలాంటి లావాదేవీలు చేసుకునేందుకు వీలుండదు. పైగా కేవైసీ కోసం బ్యాంకును సందర్శించాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్‌లో కేవైసీ అప్‌డేట్‌:

➦ మీరు ఆన్‌లైన్‌లో కేవైసీ అప్‌డేట్‌ చేసుకోవచ్చు. ముందుగా మీ బ్యాంకు ఆన్‌లైన్ బ్యాంకింగ్ పోర్టల్‌కి లాగిన్ కావాలి.

➦ దానిలో కేవైసీ ట్యాబ్ పై క్లిక్ చేయండి. అక్కడ ఆన్-స్క్రీన్ సూచనలను చదివి అనుసరించండి.

➦ అక్కడ పేరు, చిరునామా, పుట్టిన తేదీ వంటి మీ వివరాలను నమోదు చేయండి.

➦ ప్రక్రియను పూర్తి చేయడానికి పాన్, ఆధార్, ఇతర అవసరమైన పత్రాలను స్కాన్ చేసిన కాపీలను అప్‌లోడ్ చేయండి.

➦ ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి. మీకు సేవా అభ్యర్థన నంబర్ జారీ చేస్తారు. బ్యాంక్ మీకు తగిన విధంగా ఎస్ఎంఎస్ లేదా ఈ మెయిల్ ద్వారా స్థితిని తెలియజేస్తుంది.

కేవైసీకి కావాల్సిన పత్రాలు:

ఆధార్ కార్డ్, ఓటరు గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎన్ఆర్ఈజీఏ) కార్డ్. మీ కేవైసీ డాక్యుమెంటేషన్‌ను అప్‌డేట్ చేయడానికి మీరు కొన్ని సందర్భాల్లో బ్యాంక్ బ్రాంచ్‌ని సందర్శించాల్సి రావచ్చు. మీ కేవైసీ పత్రాల గడువు ముగిసినా లేదా చెల్లుబాటు కాకపోయినా ఇలా బ్యాంకుకు వెళ్లడం తప్పనిసరి.

Tags:    

Similar News