లోయలో పడిన వ్యాన్.. 11 మంది దుర్మరణం

క్షతగాత్రులను తిరుపత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా.. ప్రమాద సమయంలో వ్యాన్ లో 30 మంది వరకూ ఉన్నట్లు సమాచారం.

Update: 2022-04-02 13:38 GMT

తిరుపత్తూరు : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపత్తూరు జిల్లా జువ్వాదిమలై ప్రాంతంలో ఓ వ్యాన్ ప్రమాదవశాత్తు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 11 మంది దుర్మరణం చెందగా.. మరికొంతమంది తీవ్రగాయాలపాలయ్యారు. ప్రమాదాన్ని గ్రహించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చి, ఘటనా ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టారు.

క్షతగాత్రులను తిరుపత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా.. ప్రమాద సమయంలో వ్యాన్ లో 30 మంది వరకూ ఉన్నట్లు సమాచారం. వ్యాన్ ను నడివ్యాన్ ను నడిపే డ్రైవర్ మద్యంమత్తులో ఉండటంతో.. అదుపు కోల్పోవడంతో లోయలో పడినట్లు తెలుస్తోంది. తొలుత ఓ స్తంభాన్ని ఢీకొట్టిన వ్యాన్.. ఆపై లోయలోకి జారిపోయింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఈ ప్రమాద ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా, క్షతగాత్రులకు రూ.50 వేలు అందించాలని నిర్ణయించారు.



Tags:    

Similar News