యూపీ లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
ఉత్తర్‌ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
ఉత్తర్‌ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పన్నెండు మందికి పైగా గాయాలపాలయ్యారు. ఉత్తర్‌ప్రదేశ్ లోని బారాబంకిలో ఈ ఘటన జరిగింది. కూలీలతో వెళుతున్న బస్సును ఒక ట్రక్కు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. బారాచంకిలోని మహుంగుపూర్ సమీపంలో జరిగీన ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వీరంతా నేపాలీ కూలీలుగా గుర్తించారు.
ట్రక్కు ఢీకొట్టడంతో...
ఒక బస్సులో నేపాలీ కూలీలను గోవాకు తీసుకెళుతుండగా టైర్ పంక్చర్ అయింది. అయితే రోడ్డు పక్కనే నిలిపి డ్రైవర్ టైర్ మారుస్తున్న సందర్భంలో వేగంగా వెనక వచ్చిన ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదానికి ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. పోలీసులు క్షత గాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.