Breaking : రంగారెడ్డి జిల్లాలో పరువు హత్య
రంగారెడ్డి జిల్లాలో పరువు హత్య జరిగింది. కులాంతర వివాహం చేసుకుందని సోదరుడే తన అక్కను చంపేసిన ఘటన చో్టు చేసుకుంది
రంగారెడ్డి జిల్లాలో పరువు హత్య జరిగింది. కులాంతర వివాహం చేసుకుందని సోదరుడే తన అక్కను చంపేసిన ఘటన చో్టు చేసుకుంది. ఇబ్రహీంపట్నంలో ఈ హత్య జరిగింది. సోదరుడుఅక్కను కారుతో ఢీకొట్టి కొడవలితో నరకికి చంపిన చంపిన ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రాయపోల్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న నాగమణి పదిహేను రోజుల క్రితం పరమేశ్ తో వివాహం చేసుకుంది.
కులాంతర వివాహం చేసుకుందని...
అయితే కులాంతర వివాహం కావడంతో నాగమణి ఇంట్లో పెద్దలు అంగీకరించలేదు. పెళ్లి తర్వాత హయత్ నగర్ లో నాగమణి దంపతులు నివాసముంటున్నారు. అయితే నిన్న సెలవు దినం కావడంతో సొంతూరుకు వెళ్లిన నాగమణి తిరిగి హయత్ నగర్ కు స్కూటీపై వస్తుండగా సోదరుడు కారుతో వెంబడించి ఢీకొట్టి తర్వాత కొడవలితో నరికాడని పోలీసులు చెబుతున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.