రోడ్డుపై పల్టీ కొట్టబోయాడు.. క్షణాల్లో

వినాయక నిమజ్జన వేడుకలో తీవ్ర విషాదం నెలకొంది. గణేషుని శోభాయాత్రలో

Update: 2023-09-24 03:37 GMT

వినాయకుడిని నిమర్జనం ఘనంగా చేయాలని.. అందుకు తగ్గట్టుగా ఆడిపాడి బొజ్జ గణపయ్యను పంపించేయాలని అనుకుంటూ ఉంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు మనం అనుకున్న విధంగా ఉండదు. ఊహించని ప్రమాదాలను మనం చూడాల్సి ఉంటుంది. తాజాగా ఓ వ్యక్తి ట్రాక్టర్ మీద నుండి రోడ్డు మీద పల్టీ కొట్టాలని ప్రయత్నించాడు. అలా చేసే ప్రయత్నంలో తల రోడ్డును తాకడంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కనీసం కదలలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ప్రమాదంలో కింద పడిపోయిన వ్యక్తి ప్రాణాలు పోయాయి.

ఏపీలోని అన్నమయ్య జిల్లా రాజంపేటలో వినాయక నిమజ్జన వేడుకలో తీవ్ర విషాదం నెలకొంది. గణేషుని శోభాయాత్రలో ఓ యువకుడు క్షణాల్లో ప్రాణాలు కోల్పోయాడు. ఓ ట్రాక్టర్‌లో గణపయ్య విగ్రహాన్ని పెట్టి నిమజ్జనానికి వెళ్తున్న క్రమంలో బ్యాండ్‌ చప్పుళ్లకు గణపయ్య ముందు యువకులు ఉత్సాహంగా డ్యాన్సులు వేస్తున్నారు. పాత బస్టాండ్ సర్కిల్‌‌కు చేరుకోగా ఓ యువకుడు ట్రాక్టర్ ఇంజిన్ ఎక్కి పల్టీ కొట్టేందుకు ప్రయత్నించాడు. పల్టీ కొడుతున్న సమయంలో ల్యాండింగ్ సరిగ్గా కాకపోవటంతో తల రోడ్డుకు బలంగా కొట్టుకుంది. ఆ వ్యక్తి జీవచ్చవంలా పడిపోయాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. తలలోని నరాలు పగిలిపోయినట్టు వైద్యులు తెలిపారు. మృతుడు పేరు కిరణ్. కాగా.. రాజంపేట సాయి నగర్‌లో నివాసం ఉంటున్నాడు. డ్రైవర్‌గా జీవనం కొనసాగిస్తున్నాడు. కిరణ్‌కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.


Tags:    

Similar News