ఆ ఆటో డ్రైవర్ ప్రాణాలు పోలీసులే తీశారంటూ..!

ఒక పోలీసు అధికారి ఫిరోజ్ ని కొట్టాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

Update: 2022-06-09 05:36 GMT

బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో మంగళవారం రాత్రి రైల్వే పోలీస్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) అధికారి కొట్టడంతో ఆటోరిక్షా డ్రైవర్ మరణించాడనే ఆరోపణలు వచ్చాయి. బాధితుడిని మహ్మద్ ఫిరోజ్‌గా గుర్తించారు. ఒక పోలీసు అధికారి ఫిరోజ్ ని కొట్టాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసు అధికారి బాధితుడిని కొట్టాడని అందుకే చనిపోయాడని ఆరోపించారు స్థానికులు. రైలు పట్టాలపై ధర్నా కూడా చేశారు.

కోపోద్రిక్తులైన కుటుంబ సభ్యులు, స్థానికులు రైలు పట్టాలపై బైఠాయించి నిరసనకు దిగడంతో రైలు ప్రయాణాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆందోళనకారులు రైల్వే ట్రాక్‌లపై కూర్చోవడంతో హాజీపూర్, సమస్తిపూర్, సీతామరి, మోతీహరి ప్రాంతాలకు వెళ్ళడానికి ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బాధితుడు ఫిరోజ్ ఆటోరిక్షా డ్రైవర్‌, ఎలక్ట్రీషియన్‌గా కూడా పనిచేస్తున్నాడని స్థానికులు తెలిపారు. ఈ ఘటన తర్వాత రెచ్చిపోయిన కుటుంబ సభ్యులు ఆర్పీఎఫ్ ఏఎస్ఐ అధికారిని కూడా రైలు పట్టాలపై కొట్టారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతామని రైల్వే డీఎస్పీ అత్ను దత్తా తెలిపారు.
RPF ASI రమేష్ ప్రదేశ్ సింగ్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో తరచూ దొంగతనాలు జరుగుతున్నట్లు మాకు సమాచారం అందింది. మేము నిఘా ఉంచాము. బాధితుడు పట్టాల వెంబడి పరుగెత్తాడు.. అకస్మాత్తుగా పడిపోవడంతో ప్రాణాలు కోల్పోయాడని చెప్పుకొచ్చారు. ఈ ఘటన కారణంగా మమ్మల్ని స్థానికులు కొట్టారని రమేష్ తెలిపారు.


Tags:    

Similar News