మున్నేరు వాగులో నలుగురి మృతదేహాలు లభ్యం

కృష్ణా జిల్లాలో మున్నేరు వాగులో గల్లంతయిన ఐదుగురు విద్యార్థుల్లో నలుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి;

Update: 2022-01-11 03:29 GMT

కృష్ణా జిల్లాలో మున్నేరు వాగులో గల్లంతయిన ఐదుగురు విద్యార్థుల్లో నలుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. నిన్ని మున్నేరు వాగులో ఈత కోసం ఐదుగురు విద్యర్థులు వెళ్లారు. వీరు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెదుకులాట ప్రారంభించారు. మున్నేరు వాగు సమీపంలో వీరి సైకిళ్లు, దుస్తులు కనపడటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరో మృతదేహం కోసం.....
ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వీరి ఆచూకీ కోసం మున్నేరు వాగులో గాలింపు చర్యలు చేపట్టారు. చరణ్, బాలయేసు, అజయ్, సన్నీ మృతదేహాలు లభ్యమయ్యాయి. రాకేష్ మృతదేహం కోసం గాలింపును కొనసాగిస్తున్నారు. మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.


Tags:    

Similar News