Breaking : సైఫ్ ఆలీఖాన్ పై దుండగుల దాడి..ఒంటిపై ఆరు కత్తిపోట్లు

బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్ పై గుర్తుతెలియని కొందరు దాడికి దిగారు.;

Update: 2025-01-16 02:56 GMT

బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్ పై గుర్తుతెలియని కొందరు దాడికి దిగారు. తెల్లవారు జామును రెండు గంటల సమయంలో ఆయన ఇంట్లో ఈ దాడి జరిగింది. కత్తితో ఆయనపై కొందరు దాడికి దిగారని తెలిసింది. సైఫ్ ఒంటిపై ఆరు గాయాలయినట్లు తెలిసింది. అయితే దొంగతనానికి వచ్చిన సమయంలోనే సైఫ్ ఆలీఖాన్ అడ్డుకోవడంతో ఆయనపై దొంగలు దాడి చేసినట్లు తెలిసింది.

దొంగలను అడ్డుకోవడంతో...
ఒంటిపై ఆరు కత్తిపోట్లు తగలడంతో సైఫ్ ఆలీఖాన్ ను ముంబయిలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు. ఆయనకు శస్త్ర చికిత్స జరుగుతున్నట్లు వైద్యులు తెలిపారు. అయితే ఆయనకు ప్రాణాపాయం లేదని కూడా వైద్యులు తెలిపారు. దాడి చేసిన దుండగులు సైఫ్ ఆలీఖాన్ ను కత్తితో పొడవడంతో తీవ్ర గాయాలయ్యాయి. దాడిచేసిన వెంటనే దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. బాంద్రా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది.


Tags:    

Similar News