గుంటూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ భర్తపై కేసు నమోదు
FCRA నిబంధనలకు విరుద్ధంగా, అక్రమంగా నిధులు పొందినట్లు ఆరోపణలు రావడంతో సీబీఐ కేసు నమోదు చేసింది. లీగల్ రైట్స్..
గుంటూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ క్రిస్టినా భర్త కత్తెర సురేష్ పై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. సురేష్ హార్వెస్ట్ ఇండియా సొసైటీ అధ్యక్షుడిగా ఉన్నారు. FCRA నిబంధనలకు విరుద్ధంగా, అక్రమంగా నిధులు పొందినట్లు ఆరోపణలు రావడంతో సీబీఐ కేసు నమోదు చేసింది. లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అనే సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు.
చిన్న పిల్లల దత్తత, పిల్లల్ని విదేశాలకు తరలించడం పై కూడా సురేష్ పై అభియోగాలు నమోదయ్యాయి. కత్తెర సురేష్ కార్యకలాపాలపై విచారణ చేసి, అతనిపై చర్యలు తీసుకోవాలని గుంటూరు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ కు బాలల హక్కుల జాతీయ కమిషన్ నోటీసులు జారీ చేసింది.