మద్యం మత్తులో పెట్రోల బంకులో నిప్పు పెట్టి...?
హైదరాబాద్ నగరంలోని నాచారం పెట్రోల్ బంకులో ఒక వ్యక్తి మద్యం మత్తులో నిప్పు వెలిగించాడు
హైదరాబాద్ నగరంలోని నాచారం పెట్రోల్ బంకులో ఒక వ్యక్తి మద్యం మత్తులో నిప్పు వెలిగించాడు. పెట్రోలు నింపుతుండగా ఆ యువకుడు లైటర్ వెలిగించడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే చుట్టు పక్కల వారు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే సిబ్బంది మంటలను ఆర్పివేశారు. మంటలు పెట్రోలు బంకుకు సమీపంలోనే అంటుకోవడంతో పెద్ద ప్రమాదం ఏర్పడేదని, అయితే సకాలంలో ఆర్పి వేయడం వల్ల పెద్ద ముప్ప తప్పిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
బీహార్ కు చెందిన...
బీహార్ కు చెందిన చిరన్ అనే వ్యక్తి మద్యం తాగి పెట్రోలు బంకు కు వచ్చాడు. తన చేతిలో ఉన్న లైటర్ తో నిప్పటిస్తానని బెదిరించాడు. దీంతో పెట్రోల్ బంకులో ఉన్న వారు భయభ్రాంతులకు గురయ్యారు. ఒక మహిళ, బిడ్డ కూడా ప్రమాదం బారిన పడేవారు. అయితే నిప్పు అంటించిన వ్యక్తులు చిరన్, అరుణ్ లుగా గుర్తించారు. వెంటనే వారిద్దరినీ నాచారం పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీ ఫుటేజీని కూడా పోలీసులు పరిశీలించిన తర్వాత వారిపై కేసు నమోదుచేశారు.