తెలంగాణలో నకిలీ సర్టిఫికేట్ల ముఠా అరెస్ట్

దేశంలోని పలు యూనివర్శిటీలకు చెందిన నకిలీ సర్టిఫికేట్లను తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. హన్మకొండలో సర్టిఫికేట్లను నకిలీ సర్టిఫికేట్లు తయారీ గురించి తెలుసుకున్న

Update: 2021-12-21 10:20 GMT

చదువుకోవాల్సిన రోజుల్లో.. చదువును కొంతమంది అక్రమంగా కొనుక్కుంటున్నారు. అంతే అక్రమంగా చదువును లక్షల రూపాయలకు అమ్మేస్తున్నారు కూడా. ఫలితంగా మెరిట్ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇలా దేశంలోని పలు యూనివర్శిటీలకు చెందిన నకిలీ సర్టిఫికేట్లను తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. హన్మకొండలో సర్టిఫికేట్లను నకిలీ సర్టిఫికేట్లు తయారీ గురించి తెలుసుకున్న పోలీసులు.. ఆ స్థావరంపై రైడ్ చేశారు. వారి నుంచి 212 నకిలీ సర్టిఫికేట్లు, 6 లాప్ టాప్ లు, 1ఐపాడ్, 2 ప్రింటర్లు, 5 సీపీయూలు, 25 నకిలీ రబ్బర్ స్టాంపులు, 2 ప్రింటర్ రోలర్స్, 5 ప్రింటర్ కలర్స్ బాటిల్, 1 లామినేషన్ మిషన్, 12 సెల్ఫోన్లు, 10 లామినేషన్ గ్లాస్ పేపర్లను స్వాధీనం చేసుకున్నారు.

మొత్తం 12 మంది సభ్యుల ముఠాను వరంగల్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు సమాచారం. కాగా.. ఇప్పటికే ఈ ఫేక్ సర్టిఫికేట్లతో పలువురిని విదేశాలకు పంపినట్లు కూడా తెలుస్తోంది. వారి వివరాలను సేకరించే పనిలో పడ్డారు పోలీసులు. ఈ ముఠా సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News