తెలుగు ఐఏఎస్ అవినీతి దందా

ఆంధ్రప్రదేశ్ కు చెందిన యువ ఐఏఎస్ అధికారి ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు

Update: 2022-10-08 04:19 GMT

ఆంధ్రప్రదేశ్ కు చెందిన యువ ఐఏఎస్ అధికారి ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కంకిపాటి రాజేష్ 2011లో ఐఏఎస్ కు సెలక్ట్ అయ్యారు. ఆయన గుజరాత్ క్యాడర్ అధికారిగా తీసుకున్నారు. సురేంద్రనగర్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలను చేపట్టిన రాజేష్ అక్రమాలకు పాల్పడినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ ఏడాది మే నెలలో ప్రభుత్వం ఫిర్యాదు మేరకు సీబీఐ విచారణ జరిపి ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసింది.

ఈడీ సీజ్...
సూరత్ కు చెందిన వ్యాపారి రఫీక్ తో కలసి ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైన వాటిని క్రమబద్దీకరించడంతో పాటు మైనింగ్ లీజులు ఇచ్చి కోట్ల రూపాయలు సంపాదించారన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో మనీలాండరింగ్ కేసును ఈడీ నమోదు చేసింది. రాజేష్ బినామీగా వ్యవహరిస్తున్న రఫీక్ ఆస్తులను కూడా స్వాధీనం చేసుకుంది. మొత్తం 1.55 కోట్ల స్థిరాస్థులతో పాటు బ్యాంకు బ్యాలెన్స్ లను, ఫిక్స్‌డ్ డిపాజిట్లను కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సీజ్ చేశారు.


Tags:    

Similar News