ఇండస్ట్రీలో మరో విషాదం..కారులో ప్రముఖ సింగర్ మృతి

గుజరాత్ వల్సాద్ జిల్లాలోని పార్ నది ఒడ్డున ఓ కారు చాలా సేపు ఆగి ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా..

Update: 2022-08-30 07:31 GMT

చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవల కాలంలో బెంగాలీ నటీమణుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపాయి. తాజాగా ప్రముఖ గుజరాతీ సింగర్ వైశాలి బల్సారా తన కారులోనే విగతజీవురాలై కనిపించడం కలకలం రేపింది. వైశాలి ప్రైవేట్ ఆల్బమ్స్, స్టేజి షో లు ఇవ్వడంతో పాటు.. పలు సినిమాల్లోనూ పాటలు పాడి గుర్తింపు తెచ్చుకుంది. వైశాలి భర్త హితేష్ కూడా గాయకుడే. గత శనివారం అర్థరాత్రి హితేష్ తన భార్య కనిపించడం లేదంటూ స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వైశాలి ఆచూకీ కోసం వెతకడం ప్రారంభించారు.

గుజరాత్ వల్సాద్ జిల్లాలోని పార్ నది ఒడ్డున ఓ కారు చాలా సేపు ఆగి ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు కారు తెరిచి చూడగా.. బ్యాక సీట్లో వైశాలి విగతజీవురాలిగా కనిపించింది. వెంటనే వైశాలి మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించి, ఆమె కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. సింగర్ వైశాలి కారులో అనుమానాస్పద రీతిలో చనిపోయి ఉండటంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. భర్త హితేష్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వైశాలి అభిమానులు, నెటిజన్లు ఆమెకు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియచేస్తున్నారు.


Tags:    

Similar News