నరసరావుపేటలో భారీ అగ్నిప్రమాదం..

అగ్నిప్రమాద ఘటన గురించి తెలుసుకున్న నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా ప్రమాద స్థలానికి చేరుకుని..;

Update: 2022-10-25 03:59 GMT
Narasaraopet fire accident, 10 shops burnt in narasaraopet

Narasaraopet fire accident

  • whatsapp icon

దీపావళి పర్వదినాన పల్నాడు జిల్లా నరసరావుపేటలో గత రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 10 దుకాణాలు కాలి బూడిదయ్యాయి. ఫ్లై ఓవర్ కిందనున్న దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఆ తర్వాత క్రమంగా పక్కనున్న షాపులకు సైతం మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి.. ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు.

అగ్నిప్రమాద ఘటన గురించి తెలుసుకున్న నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా ప్రమాద స్థలానికి చేరుకుని కాలిబూడిదైన దుకాణాలను పరిశీలించారు. బాధితులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అధికారులతో సమావేశమై.. ప్రమాదం వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసి, బాధితులకు నష్టపరిహాలను ఇస్తామని హామీ ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News