మామతో కోడలు వివాహేతర సంబంధం.. ఏకాంతంగా ఉండగా కూతురు చూడటంతో..
సునీత కొంతకాలంగా తన మామతో వివాహేతర సంబంధం నడుపుతోంది. ఈ క్రమంలో వీరిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో బాలిక చూసింది.
వివాహేతర సంబంధం.. ఎంతటి ఘోరమైన పనికైనా దారితీస్తుందని నిరూపించే ఘటన ఇది. మామతో వివాహేతర సంబంధం పెట్టుకున్న కోడలు.. ఏకాంతంగా ఉన్న సమయంలో తన కూతురు చూసిందని.. కన్నకూతురినే హతమార్చింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా బోనకల్లు మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బోనకల్లు మండలానికి చెందిన పాలెపు నరసింహారావు కుమారుడికి సునీత మహిళతో వివాహమయింది. వీరికి 12 ఏళ్ల కూతురు ఉంది.
సునీత కొంతకాలంగా తన మామతో వివాహేతర సంబంధం నడుపుతోంది. ఈ క్రమంలో వీరిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో బాలిక చూసింది. దీంతో సునీత.. తన మామతో కలిసి కన్న కూతురిని కాళ్లు, చేతులు కట్టేసి వైరుతో గొంతు బిగించి చంపేసింది. కూతురి హత్యను సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు సునీత, ఆమె మామ. ప్లాన్ ప్రకారం.. తన కూతురికి అనారోగ్యంగా ఉందంటూ స్థానిక పీహెచ్ సీకి తీసుకెళ్లగా.. అక్కడి వైద్యులు పరిశీలించి అప్పటికే చనిపోయిందని నిర్థారించారు. అయితే.. పీహెచ్ సీలో పేషెంట్ చనిపోయినట్లు నిర్థారించకూడదని, వెంటనే ఖమ్మం ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు.
Also Read : వాడుకుని వదిలేయడమే జగన్ పని
వైద్యుల సూచన మేరకు ఖమ్మం ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడి వైద్యులు కూడా చనిపోయిందని నిర్థారించారు. తల్లి, తాత బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం చేయకుండా తమకు అప్పగించాలని వైద్యులను కోరారు. కానీ.. చిన్నారి మెడపై వైరు బిగుసుకున్న గుర్తులుండటంతో.. అనుమానం వచ్చిన వైద్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై కవిత ఆస్పత్రికి వచ్చి, మృతదేహాన్ని పరిశీలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అనంతరం పోస్టుమార్టం నిర్వహించగా.. అసలు విషయం బయట పడుతుండటంతో తప్పించుకునేందుకు గ్రామంలో మరో యువకుణ్ని ఇరికించాడు సునీత మామ. తన కోడలికి, ఆ యువకుడికి వివాహేతర సంబంధం ఉందని, అతనే చంపాడని కోడలితో పోలీసులకు చెప్పించారు. అతణ్ని విచారించగా వివాహేతర సంబంధం నిజమే కాని ఆ హత్యతో తనకు సంబంధం లేదని తెలిపాడు. ఆ తర్వాత తల్లి సునీతను విచారణ చేయగా.. నిందితులు నిజం అంగీకరించారు. మామ, కోడలిని అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచారు.