Hyderabad: హైదరాబాద్ పోలీసులపై దొంగల దాడి.. ఏమి చేశారంటే?
హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది;
హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సిటీ పోలీసులు దోపిడీ దొంగలపై కాల్పులు జరిపారు. నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను ప్రశ్నిస్తూ ఉండగా.. ఓ వ్యక్తి గొడ్డలితో పోలీసులపై దాడికి యత్నం. మరో వ్యక్తి రాళ్లతో పోలీసులపై దాడికి తెగబడ్డాడు.దొంగల దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో పోలీసుల కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులకి తీవ్ర గాయాలయ్యాయి.
గాయపడినవారిని ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన అనీస్, రాజ్‌గా గుర్తించారు. వీరితో పాటు గ్యాంగుకు చెందిన మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాల్పులు జరపడంతో వారు పరారయ్యారని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దొంగలు తమపై దాడికి ప్రయత్నించడంతో పోలీస్ డెకాయ్ టీం కాల్పులు జరిపారని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.