కీచక టీచర్ వద్ద లక్షల కొద్దీ నీలి చిత్రాలు.. 19 ఏళ్లుగా అతనికి ఇదే పని

ఇటలీలోని మార్చే రీజియన్ లోని అంకోనా సిటీలో ఒక సంగీతకారుడు(49) చిన్నారులకు సంగీతం పాఠాలు చెప్పేవాడు. చిన్నారులకు

Update: 2021-12-19 08:14 GMT

ప్రపంచ వ్యాప్తంగా చిన్నారులపై అకృత్యాలు, లైంగికదాడులు, వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. తప్పు చేసినవారిలో ఎంతమందికి ఎన్ని కఠిన శిక్షలు విధిస్తేనేమి.. క్షణికానందం కోసం తప్పు చేసే వాళ్లు చేస్తూనే ఉంటున్నారు. ముఖ్యంగా పోర్న్ చిత్రాలు.. కామకోరికలకు తెరలేపి.. ఎంతో మంది జీవితాలను నాశనం చేస్తున్నాయి. చిన్నారులపై దారుణాలను ఆపాలంటే.. వాళ్లను ఎల్లవేళలా తల్లిదండ్రులు కనిపెట్టుకుంటూ.. జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. అనవసరమైన వీడియోలు, దారుణాలను ప్రేరేపించే ఘటనలకు, వ్యక్తులకు దూరంగా ఉంచాలి. తాజాగా ఇటలీ ఓ సంగీతకారుడి వద్ద చిన్నారులపై అఘాయిత్యాలకు ప్రేరేపించేలా లక్షలకొద్దీ చైల్డ్ పోర్నో గ్రపి వీడియోలను గుర్తించారు పోలీసులు. వెంటనే అతడిని అరెస్ట్ చేశారు.

హార్డ్ డిస్క్ లో లక్షల వీడియోలు
ఇటలీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటలీలోని మార్చే రీజియన్ లోని అంకోనా సిటీలో ఒక సంగీతకారుడు(49) చిన్నారులకు సంగీతం పాఠాలు చెప్పేవాడు. చిన్నారులకు సంగీతం నేర్పించే అతని వద్ద లక్షలకొద్దీనీలి చిత్రాలున్నట్లు విశ్వసనీయ సమాచారం రావడంతో.. పోలీసులు అతని ఇంటిపై దాడులు నిర్వహించారు. ఇంట్లో సోదాలు చేయగా.. చిన్నారుల నీలి చిత్రాలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు లక్షలకొద్దీ లభ్యమయ్యాయి. ప్రస్తుతం అతని వయస్సు 49 ఏళ్లు కాగా.. 30 ఏళ్ల వయసునుండే అతను చిన్నారుల నీలిచిత్రాల వీడియోలు, ఫొటోల సేకరణ ప్రారంభించినట్లు పోలీసులు గుర్తించారు. చిన్నారులతో పెద్దలు లైంగిక కార్యకలాపాల్లో ఎలా పాల్గొంటున్నారన్న వీడియోలే అధికంగా ఉన్నట్లు గుర్తించారు. వాటిని వివిధ కేటగిరీలుగా విభజించి.. హార్డ్ డిస్క్.. వివిధ రకాలుగా స్టోర్ చేసి ఉంచాడు. ఇలా అతనివద్ద ఉన్న లక్షల వీడియోలు, ఫొటోలను పోలీసులు స్వాధీనం చేసుకుని, అతడిని అరెస్ట్ చేశారు.
కాగా.. నిందితుడి వద్ద సంగీతం నేర్చుకునేందుకు వచ్చే చిన్నారుల్లో ఎవరైనా లైంగిక వేధింపులకు గురయ్యారా ? వీడియోల చిత్రీకరణకు ఆ చిన్నారులను కీచక సంగీతం టీచర్ ఉపయోగించుకున్నాడా ? అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇప్పటి వరకైతే.. తమ విచారణలో అలాంటి ఘటనలు లేవీ బయటపడలేదని, చిన్నారుల తల్లిదండ్రుల్లో ఎవరూ అలాంటి ఫిర్యాదులు చేయలేదని పోలీసులు తెలిపారు.







Tags:    

Similar News