పెళ్లి చేసుకుంటానని నమ్మించి 53 ఏళ్ల తైవాన్ మహిళపై.. 29ఏళ్ల యువకుడు అత్యాచారం

పెళ్లి చేసుకుంటానని నమ్మించి 53 ఏళ్ల తైవాన్ మహిళపై అత్యాచారం

Update: 2022-07-27 02:09 GMT

గురుగ్రామ్‌లో పెళ్లి సాకుతో 53 ఏళ్ల తైవాన్ జాతీయురాలిపై అత్యాచారం చేసినందుకు 29 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు. పిటిఐ నివేదికల ప్రకారం, 2017 నుండి గురుగ్రామ్‌లో నివసిస్తున్న మహిళ తన ఫిర్యాదులో నిందితుడు రవీంద్ర విశ్వకర్మను ఫిబ్రవరిలో కలిశానని పేర్కొంది. నిందితుడు సెక్టార్ 52లో మహిళ ఉన్న ప్రాంతానికి సమీపంలో నివసించేవాడు. పరిచయం తర్వాత ఇద్దరూ మాట్లాడుకోవడం ప్రారంభించారు. నిందితుడు ఆమెకు పెళ్లి ప్రపోజ్ చేశారు. పెళ్లి చేసుకుంటానని తప్పుడు హామీతో నిందితుడు తనతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడని మహిళ ఆరోపించింది. చివరకు పెళ్లికి నిరాకరించి ఆమె నంబర్‌ను బ్లాక్‌ చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారనికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటన జరిగిన తర్వాత తనను పెళ్లి చేసుకోవాలని కోరితే.. అతను నిరాకరించాడని ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రవీంద్రను అరెస్టు చేశారు. అతనిపై ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితుడు తనపై వచ్చిన ఆరోపణలను అంగీకరించాడని, అతణ్ని సిటీ కోర్టులో హాజరు పరుస్తామని స్థానిక పోలీస్ అధికారులు తెలిపారు.

మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, నిందితుడు విశ్వకర్మపై పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ (ఐపిసి) సెక్షన్ 376 (రేప్) కింద కేసు నమోదు చేశారు. అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ చంద్రకాంత్ మాట్లాడుతూ.. నిందితుడిని అరెస్టు చేశామని, తనపై వచ్చిన ఆరోపణలను అంగీకరించాడని, అతన్ని సిటీ కోర్టులో హాజరు పరుస్తామని చెప్పారు.


Tags:    

Similar News