శంషాబాద్ లో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం

ఆ పాపపై కన్నేసిన వెంకటయ్య అనే యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం చిన్నారి నొప్పిభరించలేక ఏడుస్తూ..;

Update: 2023-03-16 08:11 GMT
girl physical assault, Shamshabad crime news

Shamshabad crime news

  • whatsapp icon

శంషాబాద్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నారు. బాధిత బాలిక తల్లిదండ్రులు ఉపాధి నిమిత్తం బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వలస వచ్చారు. ప్రస్తుతం శంషాబాద్ లోని ఫ్లై ఓవర్ లేబర్ క్యాంప్ లో నివాసం ఉంటోంది. వీరికి నాలుగేళ్ల పాప ఉంది. తల్లిదండ్రులు పనుల్లో నిమగ్నమై ఉండగా చిన్నారి బయట ఆడుకుంటోంది.

ఆ పాపపై కన్నేసిన వెంకటయ్య అనే యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం చిన్నారి నొప్పిభరించలేక ఏడుస్తూ రక్తస్రావంతో కనిపించడంతో.. స్థానికులు నీలోఫర్ ఆస్పత్రికి తరలించి తల్లిదండ్రులు సమాచారమిచ్చారు. చిన్నారికి తీవ్ర రక్తస్రావ్యం అవ్వడంతో వైద్యులు వెంటనే సర్జరీ చేశారు. ప్రస్తుతం పాప ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని వెంకటయ్యను అరెస్ట్ చేశారు. ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించినప్పటికీ.. కామాంధుల ఆలోచనల్లో మాత్రం మార్పు రావడటం లేదు.




Tags:    

Similar News