చైతన్యపురిలో దారుణం.. ఉద్యోగం పేరుతో యువతిపై అఘాయిత్యం

అతని వంచన మాటలు నమ్మిన యువతి.. నిజంగానే ఉద్యోగం ఇస్తాడనుకుంది. ఈనెల 9వ తేదీన దిల్ సుఖ్ నగర్ వచ్చిన నిందితుడు (23) యువతిని

Update: 2022-03-28 05:55 GMT

హైదరాబాద్ : ఉద్యోగం పేరుతో ఓ యువతిపై యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన హైదరాబాద్ లోని చైతన్యపురి పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్నూల్ జిల్లా కొలిమిగుండ్ల మండలానికి చెందిన 19 ఏళ్ల యువతి నాలుగేళ్లుగా దిల్ సుఖ్ నగర్లోని చైతన్యపురి కాలనీలో ఉంటూ.. టెలీకాలర్ గా పనిచేస్తోంది. మార్చి 7వ తేదీన ఆమెకు సిద్ధార్థరెడ్డి అనే వ్యక్తి ఫోన్ చేసి, తమ కంపెనీలో ఉద్యోగం ఉందని, నెలకు రూ.18 వేలు జీతం ఇస్తామని నమ్మబలికాడు.

అతని వంచన మాటలు నమ్మిన యువతి.. నిజంగానే ఉద్యోగం ఇస్తాడనుకుంది. ఈనెల 9వ తేదీన దిల్ సుఖ్ నగర్ వచ్చిన నిందితుడు (23) యువతిని కారులో ఎక్కించుకుని ఎర్రగడ్డకు తీసుకెళ్లాడు. ఆమె గుర్తింపుకార్డులు, ఫొటోలు తీసుకున్నాడు. ఎస్సార్ నగర్ లోని ఓ లాడ్జిలో యువతిపేరిట రూమ్ బుక్ చేశాడు. భయపడిన యువతి ఉద్యోగం గురించి అడగ్గా.. రాత్రి భోజనం తర్వాత దాని గురించి మాట్లాడి, అడ్వాన్స్ ఇస్తానని నమ్మించి లాడ్జ్ కు తీసుకెళ్లాడు.
లాడ్జ్ లో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం ఎవరికైనా చెప్తే తీవ్ర పరిణామాలుంటాయని, ఫొటోలు మీడియాకు ఇస్తానని బెదిరించాడు. ఎలాగొలా అక్కడి నుంచి తప్పించుకున్న బాధిత యువతి.. జరిగిన ఘటనపై కుటుంబ సభ్యులతో కలిసి చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అక్కడ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు కేసును ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.


Tags:    

Similar News