తల్లి ముందే తమ్ముడిని హత్య చేసిన అన్న

గొడవను ఆమె ఆపడానికి ప్రయత్నించగా అది వీలు పడలేదు. వారిద్దరి మధ్య గొడవ మరింత పెరిగింది.

Update: 2021-12-22 04:35 GMT

మానవ సంబంధాలు రోజు రోజుకీ ఎంత దారుణంగా తయారవుతూ ఉన్నాయో తెలిపే ఘటన ఇది. మద్యం మత్తు మనిషిని మరింత నీచాలకు పాల్పడేలా చేస్తోంది. హర్యానాలోని ఫరీదాబాద్‌లో జరిగిన గొడవలో ఓ వ్యక్తి తన తమ్ముడిని కత్తితో పొడిచి హత్య చేశాడు. ఘటన అనంతరం నిందితుడు పారిపోయి పరారీలో ఉన్నాడు. మృతుడి బంధువు తెలిపిన వివరాల ప్రకారం చనిపోయిన వ్యక్తిని 20 సంవత్సరాల విష్ణు గా గుర్తించారు. అతని అన్న సోను తమ్ముడిని హత్య చేసి ఆ తర్వాత పరారీలో ఉన్నాడు.

తల్లి కళ్లముందే..
ఓ కొడుకు చనిపోగా.. మరో కొడుకు జైలు పాలవ్వబోతున్నాడని తెలిసి వారి తల్లి భోరున విలపించింది. తన కుమారులిద్దరూ మద్యం సేవించారని.. ఏదో విషయంలో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది ఆమె తెలిపింది. గొడవను ఆమె ఆపడానికి ప్రయత్నించగా అది వీలు పడలేదు. వారిద్దరి మధ్య గొడవ మరింత పెరిగింది. తిట్టుకోవడం కొట్టుకోవడం దగ్గర నుండి ఏకంగా కత్తితో చంపుకునే దాకా వెళ్ళింది. తల్లి ముందే ఆ అన్న తమ్ముడిని కత్తితో పొడిచి పారిపోయాడు.
ఇంకా ఫిర్యాదు చేయని బంధువులు
రక్తపు మడుగులో ఉన్న అతడిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మరణించాడని వైద్యులు ధృవీకరించారు. బాద్ షాఖాన్ సివిల్ హాస్పిటల్ నుండి ఈ ఘటనపై సమాచారం అందిందని ఏసీపీ సత్పాల్ యాదవ్ తెలిపారు. అన్నదమ్ములిద్దరూ ఘర్షణ పడ్డారని.. తమ్ముడిని హత్య చేసిన అన్న ఆ తర్వాత అక్కడి నుండి పారిపోయాడని విచారణలో తేలిందని అన్నారు. ప్రస్తుతం మృతుడి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ఏసీపీ తెలిపారు. ఫిర్యాదు స్వీకరించిన తర్వాతే నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, మృతుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాద్‌షా ఖాన్ సివిల్ హాస్పిటల్ మార్చురీలో ఉంచామని ఏసీపీ తెలిపారు.


Tags:    

Similar News