Tulasi Babu : ఎవరీ తులసి బాబు..ఇతని బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే నోరెళ్ల పెట్టాల్సిందే

వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో చెలరేగిపోయిన తులసిబాబును ఒంగోలు పోలీసులు విచారించారు;

Update: 2025-01-30 02:40 GMT
tulsibabu,  investigated, ongole police, gudivada
  • whatsapp icon

వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో చెలరేగిపోయిన తులసిబాబును ఒంగోలు పోలీసులు విచారించారు. రఘురామ కృష్ణరాజు ను టార్చర్ పెట్టిన కేసులో తులసిబాబు నిందితుడిగా ఉన్నాడు. నాడు వైసీపీ నేతలకు సన్నిహితంగా ఉన్న ఈయన అధికారం మారిన వెంటనే టీడీపీ నేతలకు కూడా ఇష్టుడిగా మారిపోయాడు. దీంతో గుడివాడలో తనకు ఎదురు లేదని భావించిన తులసిబాబును పట్టుబట్టి మరీ రఘురామ కృష్ణరాజు కేసు నమోదు చేయించడంలో సక్సెస్ అయ్యారు. ఇటీవల రఘు రామకృష్ణరాజు గుంటూరు జైల్లో తనను గుండెలపై కూర్చుని తన్నిన వాళ్లను కూడా పరేడ్ ద్వారా గుర్తు పట్టారు. దీంతో తులసిబాబును విచారించేందుకు ఒంగోలు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.

పోలీసులను బెదిరించి...
పోలీసులను కూడా బెదిరించే స్థాయికి తులసి బాబు బ్యాచ్ చేరుకుందంటే అధికారులకే ఆశ్చర్యం వేసింది. ఒంగోలు పోలీసు కార్యాలయానికి ఇటీవల కార్లు, అనుచరులతో భారీ ర్యాలీగా వచ్చి హడావిడి చేసిన తులసిబాబు అనుచరులు పోలీసులకు కూడా వార్నింగ్ ఇచ్చారు. గుడివాడ వస్తే అంతు చూస్తామని బెదిరించారు. దీంతో ఈ నెల 8వ తేదీన తులసిబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు రోజులు పాటు విచారించిన ఒంగోలు పోలీసులు తులసిబాబు నుంచి అనేక విషయాలను తెలుసుకున్నారు. ఆయన వెనక ఎవరున్నారు? ఎవరు చెబితే దాడికి దిగాల్సి వచ్చింది? బిగ్ బాస్ ఎవరు? అన్న దానిపై పోలీసులు ఆరా తీసినట్లు తెలసింది.
దుబాయ్ లో వ్యాపారం...
తులసీబాబు తన స్నేహితులతో కలసి దుబాయ్ లో వ్యాపారం చేస్తున్నట్లు విచారణలో వెల్లడయింది. బిగ్ బాస్ బృందంలో మొత్తం నలుగురు సభ్యులున్నట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. వారు ఎవరు? ఎక్కడ ఉన్నారన్న దానిపై పోలీసులు తులసిబాబును అడిగి తెలుసుకున్నారు. రఘురామ కృష్ణరాజుపై సీఐడీ కార్యాలయంలో దాడి చేసినప్పుడు బిగ్ బీ టీం సభ్యులు ఎవరైనా ఉన్నారా? అన్న దానిపై కూడా పోలీసులు ఆరా తీశారు. అంతేకాదు పోలీసులపై దాడికి దిగబోయిన తులసీబాబు అనుచరులు ఇరవై మందిపై కూడా ఒంగోలు పోలీసులు కేసు నమోదు చేశారు. వీరందరికీ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. స్టేషన్ వద్దే ఆందోళనకు దిగేంత ధైర్యాన్ని వారికి వెనక నుంచి ఇచ్చెందవరన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News