48 గంటల పాటు ఇంటర్నెట్ బంద్

అమలాపురం అల్లర్ల కేసులో మరో 20 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఈ ఘటనలో అరెస్ట్ చేసిన వారి సంఖ్య 91కు చేరుకుంది

Update: 2022-06-02 13:52 GMT

అమలాపురం అల్లర్ల కేసులో మరో 20 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఈ ఘటనలో అరెస్ట్ చేసిన వారి సంఖ్య 91కు చేరుకుంది. కోనసీమ జిల్లాలో ఇంకా ఇంటర్నెట్ ను పునరుద్ధరించలేదు. దాదాపు ఎనిమిది మండలాల్లో మరో 48 గంటల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. కోనసీమ జిల్లాను అంబేద్కర్ జిల్లాగా ప్రకటించడంపై అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. గత నెల 24వ తేదీ నుంచి కోనసీమలో ఇంటర్నెట్ సేవలను బంద్ చేశారు.

ఫుటేజీ ద్వారా గుర్తించి....
ఇందులో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లను దుండగులు దగ్దం చేశారు. ఈ నేపథ్యంలో వారిని గుర్తించి అరెస్ట్ చేేసే ప్రక్రియ ప్రారంభమయింది. వివిధ ఛానెళ్ల ఫుటేజీని పరిశీలిస్తూ పోలీసులు వరసగా అరెస్ట్ లు చేస్తున్నారు. అరెస్ట్ అయిన వారిలో అన్ని పార్టీల నేతలు ఉండటం విశేషం. అయితే ఆస్తుల డ్యామేజీకి సంబంధించి నిధుల ఆస్తులను సీజ్ చేసి వారి నుంచి రికవరీ చేయాలని పోలీసులు భావిస్తున్నారు.


Tags:    

Similar News