మంచు మనోజ్ పై కేసు నమోదు
సినీనటుడు మంచు మనోజ్ ఆయన భార్య మౌనికపై పోలీసులు కేసు నమోదు చేశారు.
సినీనటుడు మంచు మనోజ్ ఆయన భార్య మౌనికపై పోలీసులు కేసు నమోదు చేశారు. సినీనటుడు మోహన్ బాబుఇచ్చిన ఫిర్యాదుతో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మోహన్ బాబు ఇంట్లో గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. తండ్రీకొడుకులు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదుచేసుకున్నారు. ఆస్తి గొడవలని మోహన్ బాబు ఫిర్యాదు చేయగా, అలాంటిదేమీ లేదని మనోజ్ అంటున్నారు.
విష్ణు రాకతో...
ఈ నేపథ్యంలో పహాడీషరీఫ్ పోలీసులు మంచు మనోజ్, మౌనికలపై కేసు నమోదుచేశారు. అలాగే మనోజ్ ఇచ్చిన ఫిర్యాదుతో విజయరెడ్డి, కిరణ్ తో పాటు మరికొందరిపై కేసు నమోదయింది. పోలీసులు రెండు కేసులను నమోదు చేసి దర్యప్తుచేస్తున్నారు. మరోవైపు మంచు విష్ణు దుబాయ్ నుంచి వచ్చినేరుగా జల్పల్లిలోని ఇంటికి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయన మాట్లాడుతూ కుటుంబ గొడవలు సర్దుకుంటాయనిచెప్పారు. అందరం కలసి కూర్చుని మాట్లాడుకుంటే సమసి పోతాయనిఅన్నారు.