ప్రభుత్వ బిల్డింగ్ బేస్ మెంట్ లో కోట్ల నగదు, బంగారం బిస్కెట్లు

శుక్రవారం (మే19) రాత్రి జరిగిన ఈ ఘటన గురించి సమాచారం తెలియగానే రాష్ట్ర ప్రభుత్య ముఖ్య కార్యదర్శి ఉషాశర్మ, డీజీపీ..

Update: 2023-05-20 13:32 GMT

రాజస్థాన్ లోని ఓ ప్రభుత్వ భవనం బేస్ మెంట్ లో నోట్లకట్టలు, బంగారం బిస్కెట్లు బయటపడటం కలకలం రేపింది. నిన్ననే ఆర్బీఐ రూ.2000 నోటును రద్దుచేస్తూ ప్రకటన చేసిన నేపథ్యంలో.. కొద్దిసేపటికే ప్రభుత్వ బిల్డింగ్ లో రూ.2.31 కోట్లకు పైగా నగదు బయటపడటం పలు అనుమానాలకు తావిస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. యోజన భవన్ లోని బేస్ మెంట్ కు వెళ్లే అధికారం ఉన్న 7-8 మంది ఉద్యోగులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

శుక్రవారం (మే19) రాత్రి జరిగిన ఈ ఘటన గురించి సమాచారం తెలియగానే రాష్ట్ర ప్రభుత్య ముఖ్య కార్యదర్శి ఉషాశర్మ, డీజీపీ ఉమేష్ మిశ్రా, ఏడీజీపీ దినేశ్, జైపూర్ కమిషనర్ ఆనంద్ శ్రీవాస్తవ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఐటీ శాఖ అడిషినల్ డైరెక్టర్ మహేశ్ గుప్తా ఇచ్చిన సమాచారం మేరకు డబ్బు, బంగారాన్ని జప్తు చేసినట్లు వారు వెల్లడించారు. అక్కడున్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని ఆనంద్ కుమార్ శ్రీవాస్తవ వెల్లడించారు. చాలా ఏళ్లుగా మూతపడి ఉన్న ఆ అల్మారాలోకి నగదు ఎలా వచ్చిందన్నదానిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


Tags:    

Similar News