ఎలుకను చంపిన వ్యక్తి.. కేసు నమోదు చేసి, జైలులో పెట్టిన పోలీసులు

క్రూరమైన రీతిలో ఎలుక ప్రాణాలు తీసిన మనోజ్ కుమార్ పై పోలీసులు సెక్షన్ 429, సెక్షన్ 11 (1) (1)ల కింద కేసు నమోదైంది.

Update: 2022-11-29 12:21 GMT

Rat killed in uttarpradesh

ఎలుకను చంపిన వ్యక్తిపై పోలీస్ కేసు నమోదైంది. ఉత్తరప్రదేశ్ లో ఎలుక పట్ల క్రూరంగా వ్యవహరించిన ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మనోజ్ కుమార్ అనే వ్యక్తి ఓ ఇటుకరాయికి ఎలుకను కట్టేసి..దాన్ని డ్రైనేజీలోకి వదిలాడు. ఇటుకరాయికి తోకను కట్టేయడంతో అది ఎటూ వెళ్లలేక గిలగిల కొట్టుకుంది. ఈ దృశ్యాలను జంతు హక్కుల ఉద్యమకారుడు వికేంద్ర శర్మ వీడియో తీసి పోలీసులకు ఫిర్యాదు చేయగా, సదరు వ్యక్తిపై కేసు నమోదు చేశారు.

క్రూరమైన రీతిలో ఎలుక ప్రాణాలు తీసిన మనోజ్ కుమార్ పై పోలీసులు సెక్షన్ 429, సెక్షన్ 11 (1) (1)ల కింద కేసు నమోదైంది. మనోజ్ కుమార్ పై ఫిర్యాదు చేసిన వికేంద్ర శర్మ.. ఆ ఎలుకను కాపాడేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. మురికి కాలువ నుంచి ఆయన దాన్ని బయటికి తీసినా, కాసేపటికే ప్రాణాలు కోల్పోయింది. చనిపోయిన ఎలుకను ఫోరెన్సిక్ పరీక్ష నిమిత్తం బదౌన్ వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మనోజ్ కుమార్ ను స్టేషన్ కు పిలిచి విచారించారు. 10 గంటలపాటు అతడిని జైలులో ఉంచారు. కాగా.. సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ కావడంతో అది ఎంత ఇబ్బందిపెట్టినా అంత క్రూరంగా చంపి ఉండాల్సింది కాదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


Tags:    

Similar News