Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లోనే నలుగురి మృతి
హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు
హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. లారీ, స్కార్పియో వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో చిన్నారి కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని కర్నూలు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.
ఆళ్లగడ్డ నుంచి...
మృతదేహాలను పోస్టుమార్టం కోసం గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గురైన స్కార్పియో వాహనం ఆళ్లగడ్డ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన జరిగింది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. వేగంగా రావడం వల్లనే ప్రమాదానికి గురయినట్లు పోలీసులు భావిస్తున్నారు.