విషాదం.. ఆర్టీసీ బస్సు ఢీ కొని నలుగురి మృతి

వారంతా ఎంతో సంతోషంగా, భక్తిగా మేడారం జాతరకు వెళ్లి వనదేవతలను దర్శించుకుని, మొక్కులు చెల్లించుకుని తిరిగి కారులో పయనమయ్యారు..

Update: 2022-02-19 05:03 GMT

ఇటీవల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఎన్ని భద్రతా చర్యలు తీసుకున్నా.. తాగుబోతుల వల్ల, ర్యాష్ డ్రైవింగ్, అతివేగం ఇలా రకరకాల కారణాల చేత జరిగే రోడ్డు ప్రమాదాల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఫలితంగా వారి కుటుంబ సభ్యులకు తీరని శోకం మిగులుతోంది. తాజాగా తెలంగాణలో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. వారంతా ఎంతో సంతోషంగా, భక్తిగా మేడారం జాతరకు వెళ్లి వనదేవతలను దర్శించుకుని, మొక్కులు చెల్లించుకుని తిరిగి కారులో పయనమయ్యారు.

మార్గమధ్యంలో గట్టమ్మ గుడి సమీపంలోకి కారు రాగానే.. ఆర్టీసీ ఆ కారును బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారిలో నలుగురరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రగాయాలపాలయ్యారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా.. మృతులు, క్షతగాత్రులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News