YCP : వైసీపీ ఎమ్మెల్యే పీఏ ఆత్మహత్య
శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి పీఏ రవి ఆత్మహత్యకు పాల్పడ్డారు.;
శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి పీఏ ఆత్మహత్యకు పాల్పడ్డారు. వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పీఏ రవి సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. రవి తన ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. శ్రీకాళహస్తిలోని హౌసింగ్ బోర్డులో రవి నివాసముంటున్నారు. ఎమ్మెల్యే పీఏగా ఉంటూ రవి నాలుగున్నరేళ్లుగా తిరుమల దర్శన టిక్కెట్ల వ్యవహారాలను నడిపించేవారు.
కుటుంబంలో...
అయితే నిన్న రాత్రి తన ఇంటి వద్ద ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ వ్యవహారాల కారణంగానే రవి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు కుటుంబ సభ్యుల నుంచి అడిగి తెలుసుకుంటున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.