America : న్యూయార్క్ లో ఇద్దరు తెలుగు స్టూడెంట్స్ మృతి... అనుమానంగానే?
అమెరికాలో తెలుగు విద్యార్థులు మృతి చెందారు. శ్రీకాకుళానికి చెందిన నీకేష్, వనపర్తి జిల్లాకు చెందిన దినేష్ మృతి చెందారు;
అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందారు. శ్రీకాకుళానికి చెందిన నీకేష్, వనపర్తి జిల్లాకు చెందిన దినేష్ మృతి చెందినట్లు గుర్తించారు. వీరిద్దరి మృతి విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు తెలపడంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. వీరిద్దరూ ఇటీవలే ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లారు. న్యూయార్క్ లో ఉంటున్నారు. దినేష్ అమెరికాలోని హార్డ్ ఫోర్డ్ లో చేరారు. నికేష్ మాత్రం అక్కడకు వెళ్లిన తర్వాత దినేష్ రూమ్ లోనే ఉంటున్నాడు.
ఒకే రూమ్ లో...
అయితే ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై ఇంకా వివరాలు తెలియరాలేదు. ఇద్దరూ ఒకే రూములో చనిపోయి ఉండటంతో కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. డబ్బుల కోసం వారిని ఎవరైనా హతమార్చారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను ఇక్కడకు తీసుకు వచ్చేందుకు సహకరించాలని కుటుంబ సభ్యులు భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పోలీసులు దర్యాప్తు చేసి వారి మరణానికి కారణాలను తెలియజేయాలని కోరుతున్నారు.