Breaking : ముంబయి తీరంలో ఘోర ప్రమాదం.. బోటు బోల్తా పడటంతో?

ముంబయి తీరంలో ఘోర ప్రమాదం జరిగింది. ఎలిఫెంటా ద్వీపానికి వెళుతున్న సమయంలో బోటు ప్రమాదం జరిగింది

Update: 2024-12-18 13:45 GMT

ముంబయి తీరంలో ఘోర ప్రమాదం జరిగింది. ఎలిఫెంటా ద్వీపానికి వెళుతున్న సమయంలో బోటు ప్రమాదం జరిగింది. ఈ పడవ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ఇప్పటికే మరణించినట్లు సమాచారం అందుతుంది. స్పీడ్ బోట్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. గేట్ వే ఆఫ్ ఇండియా వద్దకు వెళ్లి తిరిగి వెనక్కు రావాల్సిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

సహాయక చర్యలు...
పదకొండు నేవీ బోట్లతో బృందాలు, కోస్ట్ గార్డు, మెరైన్ బృందాలు సెర్చ్ ఆపరేషన్ ను కొనసాగిస్తున్నాయి. ప్రమాదంసమయంలో బోటులో 80 మందికి పైగా ఉన్నారని సమాచారం. ఇందులో 70 మందిని సహాయక బృందాలు రక్షించాయని అధికారులు చెబుతన్నారు. సహాయకచర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. బోటులో పర్యాటకులు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.


Tags:    

Similar News