Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు స్పాట్ డెడ్
ఛత్తీస్ ఘడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడిక్కడే మరణించారు
ఛత్తీస్ ఘడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడిక్కడే మరణించారు. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని బలోద్ జిల్లాలో దౌండీ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వాహనాలు ఒకదానిని ఒకటి ఢీకొన్నాయి. ఒకటి కారు కాగా, మరొకటి ట్రక్కు. అయితే ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మరణించగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో మహిళలు కూడా ఉన్నారని చెబుతున్నారు.
గాయపడిన వారిలో...
వారిని చికిత్స నిమిత్తం రాజ్ నంద్ గావ్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు అంటున్నారు. అయితే కారులో ప్రయాణిస్తున్న ఆరుగురితో పాటు మరొకరు మరణించారు. ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతులు దుర్పత్ ప్రజాపతి, యువరాజ్ సాహు, సుమిత్రా బాయి, మనీషా కుంభకర్, సగుస్ బాయి, ఇమ్లా బాయి అని పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.