డ్రైవింగ్ తెలియదు.. అయినా కారుతో రోడ్డుపైకి వచ్చి?

తండ్రికి తెలియకుండా కారును బయటకు తీసుకు వచ్చి ప్రమాదానికి కారణమయ్యారు

Update: 2022-01-30 07:50 GMT

తండ్రికి తెలియకుండా కారును బయటకు తీసుకు వచ్చి ప్రమాదానికి కారణమయ్యారు. కరీంనగర్ లో జరిగిన రోడ్డు ప్రమాద ఘటన వెనక ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మహిళలు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదానికి తొలుత మద్యం సేవించి ఉండటమే కారణమయి ఉండవచ్చని పోలీసులు అనుమానించారు.

బ్రేక్ అనుకుని....?
కానీ మైనర్ లు కారు నడపటం తెలియక అతి వేగంతో వచ్చి ప్రమాదానికి కారణమయ్యారని తెలిసింది. కారు యజమాని రాజేంద్ర ప్రసాద్ కుమారుడు వర్థన్ కారును డ్రైవ్ చేసినట్లు తెలిసింది. ఉదయమే 6గంటల ప్రాంతంలో తల్లిదండ్రులకు తెలియకుండా వర్థన్ తన స్నేహితులు మరో ఇద్దరితో కలసి రోడ్డుపైకి వచ్చారు. అయితే కారును డ్రైవ్ చేయడం రాని వర్థన్ ఎదురుగా మనుషులు కన్పించే సరికి బ్రేక్ కు బదులు యాక్సిలేటర్ ను రైజ్ చేయడంతో కారు స్పీడ్ గా వెళ్లి గుడెసెలను ఢీకొట్టినట్లు పోలీసుల ప్రాధమిక విచారణలో వెల్లడయింది. రాజేంద్ర ప్రసాద్, వర్ధన్ లు పరారీలో ఉన్నారు. వీరిపై హత్య కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


Tags:    

Similar News