Gachibowli police: ఇలాంటి బావ మీకు ఉండకూడదని దేవుడిని ప్రార్థించండి

యశ్వంత్ అనే యువకుడి మరణానికి సంబంధించి గచ్చిబౌలి పోలీసులు

Update: 2024-09-15 08:29 GMT

25 ఏళ్ల ఎం.యశ్వంత్ అనే యువకుడి మరణానికి సంబంధించి గచ్చిబౌలి పోలీసులు సంచలన విషయాన్ని బయట పెట్టారు. మొదట ఆత్మహత్యగా భావించగా, తీరా చూస్తే హత్య అని తేలింది. ఇందుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. సంఘటన జరిగిన పది రోజుల తర్వాత, యశ్వంత్ మరణం హత్య అని తేలింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు మరెవరో కాదు చనిపోయిన వ్యక్తి బావ శ్రీకాంత్.

బెట్టింగ్‌ల వల్ల మొత్తం పోగొట్టుకున్నాడు శ్రీకాంత్. ఉన్న అప్పులు తీర్చడం శ్రీకాంత్ కు అయ్యే పని కాదు. అయితే ఆర్థిక నష్టాన్ని కప్పిపుచ్చుకునేందుకే శ్రీకాంత్ తన బావమరిది హత్యకు ప్లాన్ వేశాడు. అతడిని చంపేస్తే ఆస్తి మొత్తం తన భార్యకే వస్తుంది.. అప్పులు తీర్చేసుకోవచ్చనేది అతడి ప్లాన్. బావమరిది హత్యకు శ్రీకాంత్ ఇద్దరు సహచరులు పి ఆనంద్, ఎ వెంకటేష్‌ల హెల్ప్ తీసుకున్నాడు. ప్లాన్ వర్కౌట్ అయితే 10 లక్షలు ఇస్తానంటూ వారితో డీల్ కుదుర్చుకున్నాడు.

శ్రీకాంత్ ఆన్‌లైన్ బెట్టింగ్‌ల వల్ల 3 కోట్ల నష్టాన్ని చవిచూశాడు. యశ్వంత్ తండ్రికి చెందిన ఆస్తి శ్రీకాంత్ భార్యకు దక్కేలా చూసేందుకు యశ్వంత్‌ను హత్య చేయాలని ప్రయత్నించాడు. సెప్టెంబరు 2న ఆనంద్‌, వెంకటేష్‌లు యశ్వంత్‌ను గొంతు నులిమి హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నట్లుగా అతడి మృతదేహానికి ఉరివేసారు. యశ్వంత్ కుటుంబీకులు అనుమానించి, గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో యశ్వంత్‌ మృతి వెనుక శ్రీకాంత్‌ హస్తం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా ఈ దారుణం బయటకు వచ్చింది.


Tags:    

Similar News