కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... నలుగురి మృతి
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కల్వర్టును ఒక కారు ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కల్వర్టును ఒక కారు ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి జంగారెడ్డి గూడెం వెళుతుండగా ఈప్రమాదం జరిగినట్లు తెలిసింది. జగ్గయ్యపేట గౌరవరం వద్ద ఈ ప్రమాదం జరిగింది.
అతి వేగమే.....
అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. కల్వర్టును వేగంగా కారు ఢీకొట్టడంతో మృతుల సంకయ పెరిగిందని చెబుతున్నారు. సంఘటన స్థలికి పోలీసులు చేరుకున్నారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.