సంక్రాతి వేళ విషాదం.. ఐదుగురు యువకుల మృతి.. ప్రాణాలు తీసిన సెల్ఫీ
సంక్రాతి వేళ సిద్దిపేట జిల్లాలో విషాదం నెలకొంది. కొండపోచమ్మ సాగర్ డ్యాంలో ఏడుగురు యువకులు గల్లంతయ్యారు.;
సంక్రాతి వేళ తె సిద్దిపేట జిల్లాలో విషాదం నెలకొంది. మార్కుక్ మండలం కొండపోచమ్మ సాగర్ డ్యాంలో ఏడుగురు యువకులు గల్లంతయ్యారు. వారిలో ఐదుగురు మరణించారు.. ఇద్దరిని స్థానికులు కాపాడారు.. చనిపోయిన వారంతా ఇరవై ఏళ్ల వయసులోపు వారే కావడం మరింత విచారకరం. పోలీసు కథనం ప్రకారం హైదరాబాద్ లోని ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన యువకులు శనివారం కొండపోచమ్మ సాగర్ డ్యాం వద్దకు టూర్ కు వెళ్లారు. ఈత కొట్టెందుకు అందులో దిగి మునిగిపోయారు. వీరిలో ఐదుగురు నీట మునిగి చనిపోయారు.
మృతులు ముషీరాబాద్ కు చెందిన...
మృతులను ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన ధనుష్ , లోహిత్, చీకట్ల దినేశ్వెర్, సాహిల్, జతిన్ గా గుర్తించారు. గల్లంతయిన వారిలో ఇద్దరు బయటపడ్డారు. సెల్ఫీ పిచ్చిప్రాణాలను తీసింది. సెల్ఫీ తీసుకోవడానికి డ్యామ్ లోకి దిగిన యువకులు ఒకరు చేయి పట్టుకుని ఒకరు సెల్ఫీ తీసుకుంటుండగా మునిగిపోయారని చెబుతున్నారు. దీంతో ఐదుగురి ఇంట సంక్రాంతి వేళ విషాదం నెలకొంది. వెంటనే స్థానికులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.