న్యూఇయర్ వేళ విషాదం.. ఇద్దరు యువకుల మృతి
హన్మకొండ జిల్లా చింతకుంటలో విషాదం చోటు చేసుకుంది. ఒక క్వారీ కుంటలో ఇద్దరు యువకులు పడి మృతి చెందారు.
హన్మకొండ జిల్లా చింతకుంటలో విషాదం చోటు చేసుకుంది. ఒక క్వారీ కుంటలో ఇద్దరు యువకులు పడి మృతి చెందారు. న్యూఇయర్ సందర్భంగా పార్టీ చేసుకునేందుకు ఐదుగురు యువకులు వెళ్లారు. వారిలో ఇద్దరు యువకులు క్వారీ కుంటలో పడి మృతి చెందారు. ఇద్దరు యువకుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
మరణానికి గల కారణాలు....
అయితే మద్యం మత్తులో క్వారీలో పడి మరణించారా? లేక యువకుల మధ్య గొడవ జరిగి మరణించారా? అన్న దానిపై పోలీసులు విచారిస్తున్నారు. మిగిలిన ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మరణానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.