చికిత్స పొందుతూ తల్లి మృతి.. ఏ జరిగిందో తెలియక బిక్కమొహమేసిన పసివాళ్లు

స్థానిక కూరగాయల మార్కెట్లో హమాలీగా పనిచేస్తూ.. పిల్లలను పోషించుకుంటుంది. ఇటీవల నెలరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న..

Update: 2022-02-16 13:14 GMT

పసి పిల్లలు.. తల్లి చనిపోయిందో, బ్రతికుందో తెలియని అమాయకత్వం. అమ్మ నిద్రపోతుందనుకున్నారో ఏమో.. ఆమెను లేపే ప్రయత్నం చేశారు. అమ్మా.. అమ్మా.. అని ఎంత పిలిచినా పలుకపోయే సరికి.. దీనంగా కూర్చున్నారు. ఈ దృశ్యం చూపరులను కంటతడి పెట్టించింది. వివరాల్లోకి వెళ్తే.. ఫాతిమా అనే మహిళ కొన్ని నెలల క్రితం తన ఇద్దరు కూతుళ్లతో కలిసి షాద్ నగర్ లోని గంజ్ ప్రాంతానికి వచ్చింది.

అక్కడ స్థానిక కూరగాయల మార్కెట్లో హమాలీగా పనిచేస్తూ.. పిల్లలను పోషించుకుంటుంది. ఇటీవల నెలరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఫాతిమా ప్రభుత్వాస్పత్రిలో చేరి, చికిత్స తీసుకుంది. అక్కడి నుంచి మందులు తెచ్చుకుని వాడుతోంది. సోమవారం ఫాతిమా ఆరోగ్యం క్షీణించింది. దాంతో మరోసారి చికిత్స కోసం ఆస్పత్రిలో చేరింది. చికిత్స పొందుతూ ఫాతిమా మృతి చెందడంతో.. ఆమె ఇద్దరు కూతుళ్లు బిక్కమొహమేశారు. ఏం జరిగిందో, ఏం చేయాలో అర్థంకాక అమాయకంగా కూర్చున్నారు. ఈ దృశ్యాన్ని చూసి కొందరు చలించిపోయారు. అధికారులకు జరిగిన విషయాన్ని వివరించగా.. వారే ఫాతిమాకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. పిల్లలను శిశువిహార్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సీడీపీవో నాగమణి తెలిపారు.


Tags:    

Similar News