బీజేపీ నేత బయటకు రాగానే తూటాల వర్షం
అనుజ్ చౌదరి కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు అమిత్ చౌదరి, అనికేత్ అనే ఇద్దరు
ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ లో నడిచి వెళుతున్న బీజేపీ నేతపై దుండగులు కాల్పులు జరిపారు. అనుజ్ చౌదరి మొరాదాబాద్ పట్టణ బీజేపీ నాయకుడిగా ఉన్నారు. గురువారం సాయంత్రం పట్టణంలోని తన నివాసం నుంచి బయటకు వచ్చి నడుస్తూ ఉండగా.. బైక్ పై వచ్చిన దుండగులు వెనుక నుంచి కాల్పులు జరిపారు. అనుజ్ చౌదరి రోడ్డుపై కుప్పకూలిపోయారు. గన్ తో సమీపం నుంచి వరుసగా కాల్పులు జరిపారు. అనంతరం బైక్ పై పరారయ్యారు. అనుజ్ చౌదరి నివసించే అపార్ట్ మెంట్ ఎదుటే ఈ దారుణం జరిగింది. వెంటనే ఆసుపత్రికి తెసుకెళ్లినప్పటికీ ఫలితం లేకపోయింది.
అనుజ్ చౌదరి కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు అమిత్ చౌదరి, అనికేత్ అనే ఇద్దరునిందితులపై కేసు నమోదు చేసినట్టు జిల్లా ఎస్పీ మీనా ప్రకటించారు. హత్యకు రాజకీయ పరమైన కక్షలే కారణమని అనుజ్ చౌదరి కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఎస్పీ హేమ్‌రాజ్ మీనాతో సహా పోలీసు అధికారురు సంఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. అనూజ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు. అనూజ్‌పై కాల్పుల ఘటనలో అస్మోలీ బ్లాక్ కు చెందిన అనికేత్‌పై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. అనూజ్ హత్యలో పాల్గొన్న ఇద్దరు వ్యక్తులు అమిత్, అనికేత్ లే అని బాధిత కుటుంబం తెలిపింది. ఇరువర్గాల మధ్య వివాదాలు ఉన్నాయని, నలుగురిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.