వనమా రాఘవకు 14 రోజుల రిమాండ్
వనమా రాఘవకు పథ్నాలుగు రోజులు రిమాండ్ విధించారు. ఆయనను ఖమ్మ జిల్లా జైలుకు తరలించారు
వనమా రాఘవకు పథ్నాలుగు రోజులు రిమాండ్ విధించారు. ఆయనను ఖమ్మ జిల్లా జైలుకు తరలించారు. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో వనమా రాఘవ ఎ2 నిందితుడిగా ఉన్నారు. ఆయనను రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేశారు. వనమా రాఘవ పరారీకి సహకరించినందుకు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఖమ్మం జిల్లా జైలుకు.....
పోలీసులు రాత్రంతా రాఘవను విచారించిన పోలీసులు ఈరోజు ఉదయం ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి కొత్తగూడెం కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు రాఘవకు 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం రాఘవను ఖమ్మం జిల్లా జైలుకు తరలించారు.