పారిశుధ్య సిబ్బందిని ఢీ కొట్టిన కారు.. మహిళ మృతి

మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. వారిని 108 వాహనంలో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పారిశుధ్య కార్మికులను ఢీ..

Update: 2022-02-14 11:28 GMT

ఫ్లై ఓవర్ పై వేగంగా దూసుకొచ్చిన కారు రోడ్లు శుభ్రం చేస్తున్న సిబ్బందిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ మృతిచెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద చోటుచేసుకుంది. సోమవారం మధ్యాహ్నం బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ పై రోడ్లు శుభ్రం చేస్తున్న సిబ్బందిపైకి ఓ కారు వేగంగా దూసుకొచ్చింది. పారిశుధ్య సిబ్బందిని కారు ఢీ కొట్టగా మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు షేక్ నాగూర్ బీ(35)గా గుర్తించారు.

మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా.. వారిని 108 వాహనంలో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పారిశుధ్య కార్మికులను ఢీ కొట్టిన అనంతరం.. మరో ఆటోను కూడా ఢీ కొట్టగా ఆ ఆటో నుజ్జునుజ్జయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. కాగా.. కారు టైర్ పంక్చర్ అయి ఉండటంతో.. టైర్ పంక్చర్ అవ్వడం వల్ల కారు అదుపుతప్పి సిబ్బందిని, ఆటోని ఢీ కొట్టిందా? లేక వారిని ఢీ కొట్టాకే పంక్చర్ అయిందా ? మద్యం మత్తులో ఈ ప్రమాదం జరిగిందా ? అన్న విషయాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కారు యజమానికి సమాచారం ఇచ్చి, డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.


Tags:    

Similar News