మచిలీపట్నంలో దారుణం.. బీచ్ కు వెళ్లిన యువతిపై రేప్

మచిలీపట్నానికి సమీపంలోని పల్లిపాలెం బీచ్ లో జరిగిందీ ఘటన. మచిలీపట్నానికి చెందిన యువతి తన స్నేహితుడితో..;

Update: 2022-03-11 04:49 GMT

పల్లిపాలెం : కృష్ణాజిల్లా మచిలీపట్నంలో దారుణం జరిగింది. స్నేహితుడితో కలిసి సరదాగా బీచ్ కు వెళ్లిన యువతిపై ఇద్దరు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. యువకుడిని కొట్టి కట్టేసి.. యువతిపై దారుణానికి ఒడిగట్టారు. మచిలీపట్నానికి సమీపంలోని పల్లిపాలెం బీచ్ లో జరిగిందీ ఘటన. మచిలీపట్నానికి చెందిన యువతి తన స్నేహితుడితో కలిసి కరగ్రహారం శివారులోని పల్లిపాలెం బీచ్ కు వెళ్లింది.

అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు వారిని గమనించి వెంబడించారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న యువకులు యువకుడిపై దాడి చేసి కట్టేశారు. ఆపై యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు జరిగిన విషయాన్ని తన సోదరుడికి చెెప్పడంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాగబాబు అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.


Tags:    

Similar News